సినీ నటులు విజయ్ దేవరకొండ ప్రయాణీస్తున్న కారుకు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విజయ్ దేవరకొండకు ఎలాంటి గాయాలు కాలేదు. ఆయన సురక్షితంగానే ఉన్నారు. ఆయన ప్రయాణీస్తున్న కారు మాత్రం స్వల్పంగా దెబ్బతింది. జోగులాంబ గద్వాల జిల్లాలోని ఉండవల్లి సమీపంలో ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన తర్వాత తన స్నేహితుడి కారులో విజయ్ దేవరకొండ వెళ్లిపోయారు. శ్రీసత్యసాయి జిల్లాలోని పుట్టపర్తికి స్నేహితులతో కలిసి తిరిగి వస్తున్నసమయంలో ఈ ప్రమాదం జరిగింది. విజయ్ దేవరకొండ ప్రయాణీస్తున్న కారును బొలేరో వాహనం ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఇటీవలనే విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాకు ఎంగేజ్ మెంట్ జరిగిందని వార్తలు వచ్చాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వీరి వివాహం జరగనుందని ప్రచారం సాగుతోంది.