విధాత : తెలుగు హీరోయిన్ డింపుల్ హయతి సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువగా ఫేమస్ అయిపోతుంది. గతంలో తన అపార్ట్ మెంట్ లో పార్కింగ్ విషయమై డీసీపీ రాహుల్ హెగ్డేతో గొడపడి కేసుల పాలైన డింపుల్ హయతి తాజాగా మరో వివాదంతో చిక్కుకుంది. ఇంట్లో పెంపుడు కుక్కలు చూసుకోడానికి పని మనుషులు కావాలని ఒరిస్సా నుంచి పిలుపించుకున్న యువతులను డింపుల్ హయతి, ఆమె భర్తలు వేధించారన్న ఆరోపణలు వైరల్ గా మారాయి.
పని చేయించుకొని డబ్బులు ఇవ్వకుండా తన భర్తతో తిట్టించింది అంటూ బాధిత యువతులు ఆరోపించడం వివాదస్పదమైంది. మీరు నా చెప్పులు అంత వాల్యూ చేయరు.. నువ్వు ఎంత మీ బ్రతుకు ఎంత అంటూ పనికి వచ్చిన యువతిపై డింపుల్ హయాతి భర్త రెచ్చిపోయాడని కథనం. జీతం కూడా ఇవ్వకుండా ఇద్దరు యవతులను ఇంట్లో నుండి వెళ్లగొట్టి.. మా ఆయన లాయర్ మీరు నన్ను ఏమీ చేయలేరంటూ హీరోయిన్ డింపుల్ హయాతి బెదిరించిందని బాధితులు ఆరోపించినట్లుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
బెజవాడకు చెందిన డింపుల్ హయాతి మోడల్‌గా కెరీర్‌ను మొదలు పెట్టింది. తనదైన అందంతో మెప్పించిన ఈ భామ ‘గల్ఫ్’ అనే సినిమాతో నటిగా మారింది. దీని తర్వాత ‘అభినేత్రి 2’ మూవీలో కీలక పాత్రలో, ‘గద్దలకొండ గణేష్’ మూవీలో స్పెషల్ సాంగ్‌లో మెరిసింది. ఆ తర్వాత తెలుగులో ‘ఖిలాడి’ మూవీతో గ్లామర్ షోతో రచ్చ లేపేసింది. ‘అత్రంగి రే’ అనే హిందీ సినిమాలోనూ నటించింది. అలాగే, ‘వీరమై వాగై సూడుమ్’ అనే తమిళ చిత్రంలో చేసింది. గోపీచంద్‌తో తెలుగులో ‘రామబాణం’ చిత్రాలు చేసింది. యంగ్ హీరో శర్వానంద్ తో కలిసి బోగి అనే సినిమాలో నటించింది.