అమరావతి: సినీ నటి హేమ విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మను దర్శించుకున్నారు. అనంతరం నటి హేమ మీడియాతో మాట్లాడుతూ కన్నీరు పెట్టుకున్నారు. గత ఏడాది తనపై వచ్చిన డ్రగ్స్ కేసు నిందలన్నీ అమ్మవారు తుడిచిపెట్టారని సంతోషం వ్యక్తం చేశారు. అదే సమయంలో తాను చేయని తప్పుకు బలి అయినట్లు వాపోయారు.
దుర్గమ్మ ఇచ్చిన ధైర్యం వల్లే ఈరోజు గుడికి రాగలిగానని, అమ్మవారి గుడి ప్రాంగణంలో ఉండి మరి చెబుతున్నానని నేను ఏ తప్పు చేయలేదన్నారు. వార్తలు రాసేముందు నిజానిజాలు తెలుసుకోవాలని మీడియాను కోరారు. ఎన్ని జన్మలెత్తినా దుర్గమ్మ ఆశీస్సులు అండదండలు నేను మర్చిపోలేనని చెప్పుకొచ్చారు. తాను ప్రతిఏడాది దుర్గమ్మ దర్శనం కోసం వస్తుంటానని తెలిపారు.