Tamannaah | చిక్కుల్లో మిల్కీ బ్యూటీ తమన్నా.. సమన్లు పంపిన మహారాష్ట్ర సైబర్‌ క్రైమ్‌..!

Tamannaah | మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా చిక్కుల్లో పడింది. మహారాష్ట్ర సైబర్‌ క్రైమ్‌ పోలీసులు సమన్లు జారీ చేశారు. ఐపీఎల్‌-2023 మ్యాచ్‌లను నిబంధనలకు విరుద్ధంగా ఫెయిర్‌ ప్లే యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం చేసిందనే ఆరోపణలున్నాయి. ఈ మేరకు ఈ నెల 29న విచారణకు రావాలని నోటీసుల్లో ఆదేశించారు. ఫెయిర్‌ ప్లే కారణంగా తమకు రూ.100కోట్లకుపైగా నష్టం జరిగిందని వయాకామ్‌ పేర్కొంది. ఐపీఎల్‌ ప్రసార హక్కులను వయాకామ్‌ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

  • Publish Date - April 25, 2024 / 11:05 AM IST

Tamannaah | మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా చిక్కుల్లో పడింది. మహారాష్ట్ర సైబర్‌ క్రైమ్‌ పోలీసులు సమన్లు జారీ చేశారు. ఐపీఎల్‌-2023 మ్యాచ్‌లను నిబంధనలకు విరుద్ధంగా ఫెయిర్‌ ప్లే యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం చేసిందనే ఆరోపణలున్నాయి. ఈ మేరకు ఈ నెల 29న విచారణకు రావాలని నోటీసుల్లో ఆదేశించారు. ఫెయిర్‌ ప్లే కారణంగా తమకు రూ.100కోట్లకుపైగా నష్టం జరిగిందని వయాకామ్‌ పేర్కొంది. ఐపీఎల్‌ ప్రసార హక్కులను వయాకామ్‌ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు తమన్నాకు నోటీసులు అందించారు. ఐపీఎల్ డిజిటల్ ప్రసార హక్కులను వయాకామ్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. వయాకామ్ ఫిర్యాదుపై మహారాష్ట్ర సైబర్ సెల్ ఫెయిర్‌ప్లే యాప్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది.

ఈ విషయంపై మరింత దర్యాప్తు చేయడానికి తమన్నాను విచారించేందుకు సమన్లు పంపింది. ఈ కేసులో సాక్షిగా విచారణ జరిపేందుకు విచారణ పిలిచినట్లుగా సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, ఈ కేసులో బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌కు సైతం పోలీసులు నోటీసులు పంపారు. అయితే, తాను అందుబాటులో లేనని.. ప్రస్తుతం విచారణకు రాలేనని చెప్పారు. ఇదే కేసులో బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ను సైతం విచారణకు పిలిచారు. బెట్టింగ్ యాప్ ఫెయిర్ ప్లే ప్లాట్‌ఫారమ్ తమ ప్లాట్‌ఫారమ్‌లో అక్రమంగా మ్యాచ్‌లను ప్రసారం చేస్తుందని.. దాంతో వయాకామ్ 18కి రూ.100 కోట్ల నష్టం వాటిల్లిందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. కంపెనీ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.

Latest News