Adah Sharma| అదాశ‌ర్మ‌కు అరుదైన వ్యాధి.. 48 రోజుల పాటు ఆగ‌కుండా పీరియ‌డ్స్

Adah Sharma| తెలుగు ప్రేక్ష‌కుల‌కి అదా శ‌ర్మ గురించి ప్ర‌త్యేక పరిచ‌యాలు అక్క‌ర్లేదు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ‘హార్ట్ ఎటాక్’ మూవీతో తెలుగు ప్రేక్షకులని ప‌ల‌క‌రించిన ఈ ముద్ద‌గుమ్మ తొలి సినిమాతోనే ఎంత‌గానో అల‌రించింది. అయితే ఆ త‌ర్వాత అదాశ‌ర్మ‌కి మంచి అవ‌క‌శాలు వ‌స్తాయ‌ని అం

  • Publish Date - June 10, 2024 / 08:59 AM IST

Adah Sharma| తెలుగు ప్రేక్ష‌కుల‌కి అదా శ‌ర్మ గురించి ప్ర‌త్యేక పరిచ‌యాలు అక్క‌ర్లేదు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ‘హార్ట్ ఎటాక్’ మూవీతో తెలుగు ప్రేక్షకులని ప‌ల‌క‌రించిన ఈ ముద్ద‌గుమ్మ తొలి సినిమాతోనే ఎంత‌గానో అల‌రించింది. అయితే ఆ త‌ర్వాత అదాశ‌ర్మ‌కి మంచి అవ‌క‌శాలు వ‌స్తాయ‌ని అంద‌రు భావించారు. కాని చెప్పుకోద‌గ్గ అవ‌కాశాలు రాలేదు. వ‌చ్చిన అవ‌కాశాల‌ని కూడా అంత‌గా సద్వినియోగం చేసుకోలేక‌పోయింది. అయితే 2023లో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ‘ది కేరళ స్టోరితో’ అదా శర్మ ఒక్కసారిగా సెన్సెషన్ అయ్యింది. ఈ సినిమా ఆమెకి మంచి పేరు తీసుకొచ్చింది. ఇక ఆ త‌ర్వాత బ‌స్త‌ర్ ‘ది నక్సల్ స్టోరీ’ మూవీలో నటించింది. ఇక ఈ మూవీ కూడా మంచి విజయం సాధించడంతో ఇప్పుడు ఈ భామ క్రేజీ హీరోయిన్‌గా మారింది.

అదా శ‌ర్మ చూడ‌డానికి చాలా అందంగా ఉంటుంది. ఎవ‌రైన అదాని చూస్తే ఫిదా కాకుండా ఉండ‌లేరు. ఇంత అందంగా ఉండే ఈ భామ అరుదైన వ్యాధితో బాధ‌ప‌డుతున్న‌ట్టు తాజా ఇంట‌ర్వ్యూలో తెలియ‌జేసింది. ది కేరళ స్టోరి మూవీలో నటించనప్పుడు కాలేజీ అమ్మాయిలా కనిపించడానికి కొంత బ‌రువు త‌గ్గాల్సి వ‌చ్చింది. ఇక బస్తర్ ది నక్సల్ మూవీలో నటించినప్పుడు బరువు పెరిగాను. అందుకు కార‌ణం బరువైన గన్‌లను మోయాలి కాబట్టి లావుగా కనిపించడంతో పాటుగా కాస్త బలంగా ఉండడానికి 10 నుంచి 12 వరకు అరటి పండ్లు తిన్నాను. అలాగే గింజలు, డ్రై ఫ్రూట్స్ ఫ్లాక్ సీడ్స్ ఉన్న లడ్డూలను నాతో పాటు షూటింగ్ కు తీసుకెళ్లాను. ఇక నిద్రపోయే అరగంట ముందు రెండు లడ్డులు కూడా తినేదాన్ని. దాంతో లావు అయ్యాను.

అయితే ఇప్పుడు బార్ సినిమా కోసం నేను బరువు తగ్గాల్సి వచ్చింది. ఇలా నెలల వ్యవధిలోనే బరువు తగ్గడం, మళ్లీ పెరగడం, ఆ తర్వాత తగ్గడం వలన శ‌రీరంలో ప‌లు ర‌కాల మార్పులు చోటు చేసుకున్నాయి. ఒత్తిడికి గురి కావ‌డం వ‌ల‌న అనారోగ్యం పాల‌య్యాను. ఇప్పుడు ఎండోమెట్రియోసిస్ వ్యాధి వచ్చింది. అంటే పీరియడ్స్ నాన్‌స్టాప్‌గా కొనసాగుతూ ఉంటుంది. ఈ జబ్బు కారణంగా నేను దాదాపు 48 రోజుల పాటు ఆగకుండా వచ్చే పీరియడ్స్‌తో చాలా ఇబ్బంది పడ్డాను అంటూ అదాశ‌ర్మ షాకింగ్ కామెంట్స్ చేసింది.అయ్యో.. అదా సినిమాల కోసం ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకున్నావా అంటూ కొంద‌రు కామెంట్ చేస్తున్నారు

Latest News