Site icon vidhaatha

Aishwarya Rai Bachchan| చేతికి క‌ట్టుతోనే కేన్స్‌లో రెడ్ కార్పెట్‌పై హోయ‌లు పోయిన ఐశ్వర్య‌రాయ్..నెమలి పురివిప్పిన‌ట్టుగా ఉంది.!

Aishwarya Rai Bachchan|  ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఫ్రాన్స్‌ వేదికగా అట్ట‌హాసంగా ప్రారంభం కాగా, ఈ ఫెస్టివ‌ల్‌కి దేశ విదేశాల నుండి పలువురు ప్రముఖులు హాజ‌ర‌య్యారు. అందాల ముద్దుగుమ్మ‌లు అయితే రెడ్ కార్పెట్‌పై హోయ‌లు పోతూ సంద‌డి చేశారు. టాలీవుడ్ నుండి శోభిత ధూళిపాళ్ల హాజ‌రు కాగా, ఈ అమ్మ‌డు కూడా వెరైటీ డ్రెస్‌లో క‌నిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వ‌ర్య రాయ్ కేన్స్ ఫెస్టివల్ లో మెరిసింది. త‌న కూతురు ఆరాధ్య‌ని తీసుకొని కేన్స్ ఫెస్టివ‌ల్‌కి వ‌చ్చిన ఐశ్వ‌ర్య‌రాయ్ చేతికి క‌ట్టుతో క‌నిపించింది. పర్మినెంట్‌ కేన్స్ మెంబర్‌గా ఉన్న ఐశ్వ‌ర్య‌రాయ్ రెండు సార్లు రెడ్ కార్పెట్‌పై సంద‌డి చేసింది.

నెమలి పురివిప్పినట్టుగా ఉన్న వెరైటీ డిజైనింగ్‌ వేర్‌లో ఐశ్వర్యా రాయ్ తాజాగా హోయ‌లు పోయింది. రెడ్ కార్పెట్‌పై అలా ఐశ్వ‌ర్య‌రాయ్ న‌డుచుకుంటూ వ‌స్తుంటే ఆమెని చూసిన వాళ్లంద‌రు కూడా కెమెరాల‌లో బంధించేందుకు పోటీ ప‌డ్డారు. మొద‌ట ఐష్ .. రెడ్ కార్పెట్ పై బ్లాక్ అండ్ గోల్డ్ గౌన్ ధరించి, బంగారు అలంకరణ వస్తువులతో మెరిసింది.. ఫాల్గుణి, షేన్ డిజైన్ చేసిన వస్త్రధారణలో ఐశ్వర్య లుక్స్ అదిరిపోయాయి. ప్ర‌స్తుతం ఐశ్వ‌ర్య‌రాయ్ కేన్స్ ఫిలిం ఫెస్టివ‌ల్‌లో పాల్గొన్న‌ట్టువంటి పిక్స్ నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. అయితే ఈ ఫొటోల‌లో ఐశ్వ‌ర్యరాయ్ చేతికి క‌ట్టుతో క‌నిపించ‌డం విశేషం.

అస‌లు ఐష్ చేతికి ఏమైంది, అంత పెద్ద క‌ట్టుకుంది ఏంటని ప్ర‌తి ఒక్క‌రు ఆరాలు తీస్తున్నారు. అయితే చేతికి గాయం కావడంతో ఈసారి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ పై ఐశ్వ‌ర్య‌రాయ్ కనిపించడం అనుమానమే అని చాలామంది అనుకున్నారు. కాని ఈ విశ్వ‌సుంద‌రి మాత్రం తన నిబద్ధతను చాటుకుంది. రెడ్ కార్పెట్‌పై త‌న కూతురితో కలిసి న‌డుస్తూ ర‌చ్చ చేసింది. కాగా ఐశ్వర్యారాయ్ 2002లో షారుఖ్ ఖాన్, సంజయ్ లీలా భన్సాలీ కాంబినేషన్ లో వచ్చిన దేవదాస్ సినిమా ప్రీమియర్ షోతో మొదటిసారి కేన్స్ లో అడుగుపెట్టి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.

Exit mobile version