Lavanya| రాజ్ తరుణ్, లావణ్యల పేర్లు గత కొద్ది రోజులుగా వార్తలలో నిలుస్తుండడం మనం చూస్తూ ఉన్నాం. ఒకరి గురించి ఒకరు విమర్శలు చేసుకోవడం, వారి బండారాలని బయటపెట్టుకోవడం హట్ టాపిక్ అవుతూనే ఉన్నాయి.లావణ్య.. హీరో రాజ్ తరుణ్ తనని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసాడని, అబార్షన్ చేయించాడని, ఇప్పుడు మాల్వి మల్హోత్రాతో ప్రేమాయణం సాగిస్తున్నాడంటూ పలు ఆరోపణలు చేసింది లావణ్య. అయితే వీరి విషయంలో రోజుకొక ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. ఈ క్రమంలో శుక్రవారం అర్ధరాత్రి తన ప్రియుడు తనకు దక్కాలని లేదంటే చనిపోతానంటూ ఆత్మహత్య లేఖ రాయడం కలకలం రేపుతోంది.
లావణ్య శుక్రవారం అర్ధరాత్రి తన లాయర్ దిలీప్ సుంకరతో చాటింగ్ చేస్తూ.. రాజ్ తరుణ్ తనకి దక్కపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ చాటింగ్ లో పేర్కొంది. వెంటనే దిలీప్ పోలీసులు, మీడియాకు సమాచారం అందించారు. అప్పుడు నార్సింగి పోలీసులు ఆమె ఇంటికి వెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చి కాపాడారు. ‘రాజ్ లేని ప్రపంచంలో నేను ఉండలేను. అతడు మారిపోయాడు. నా చావును కోరుకున్నాడు. దీనంతటికీ మాల్వినే కారణం. నా దగ్గరి వాళ్లు కూడా నన్ను అర్థం చేసుకోలేదు’అంటూ లావణ్య ఆవేదన వ్యక్తం చేసింది. మైండ్ గేమింగ్, గాసిప్స్ తో చాలా విసిగిపోయాను. మస్తాన్ కేసులో నేను కీలు బొమ్మను అయ్యాను. ప్రతిదీ ఒక పథకం ప్రకారం జరిగింది. నా భర్త నాకు కావాలని మాల్వి మలోత్రాను బ్రతిమిలాడిన కూడా ఆమె వినిపించుకోలేదు.
నా చావుకు కారణం రాజ్ తరుణ్, అతని తల్లిదండ్రులు, మాల్వీ మలోత్రా. రాజ్ తరుణ్ మాల్వీ మలోత్రా మోజులో పడి మారి పోయాడు. నా మరణాన్ని కోరుకుంటున్నాడు అంటూ చాట్ చేసినట్టు తెలుస్తుంది. మరోవైపు లావణ్య … నేను ఈ లోకం విడిచి వెళ్లిపోతున్నానంటూ ఎమర్జెన్సీ నంబర్ డయల్ 112కు ఫోన్ చేసి చెప్పడంతో నార్సింగ్ పోలీసులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా లావణ్య నివాసానికి చేరుకొని ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి భరోసా కల్పించారు.