Site icon vidhaatha

Ajith| స్టార్ హీరో అజిత్ భార్య షాలినికి ఏమైంది.. హాస్పిట‌ల్‌లో చేర‌డానికి కార‌ణం ఏంటి?

Ajith| త‌ల అజిత్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న‌కి త‌మిళంలోనే కాదు తెలుగులోను విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్ప‌టికీ వైవిధ్య‌మైన చిత్రాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్నాడు. ప్రస్తుతం విడాముయర్చి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ మూవీ షూటింగ్ తో బిజీగా ఉన్నాడు అజిత్. అయితే ఇందులో త్రిష క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా, సినిమాను లైకా ప్రోడక్షన్స్‌పై మగిళ్‌ తిరుమేని తెరకెక్కిస్తున్నారు. అలానే సుభాస్కరన్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి అజిత్‌ ఫస్ట్‌ లుక్‌ని విడుదల చేయ‌గా, ఇందులో అజిత్ లుక్ చూసి అంద‌రు ఆశ్చ‌ర్య‌పోయారు. మూవీ ఎప్పుడు విడుద‌ల అవుతుందా అని ప్ర‌తి ఒక్క‌రు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

విడతలి మూవీ చివరి షూటింగ్ కోసం అజిత్ అజర్ బైజాన్ వెళ్లారు. అయితే నిన్న హడావిడిగా అజర్‌బైజాన్ నుంచి చెన్నైకి తిరిగి వచ్చారు అజిత్. చెన్నై ఎయిర్ పోర్టు నుంచి నేరుగా ఆసుపత్రికి వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. అయితే అజిత్ అర్జెంట్‌గా ఆసుప‌త్రికి వెళ్ల‌డానికి కార‌ణం అత‌ని భార్య షాలినికి చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చిన్నపాటి సర్జరీ జరిగిందని సమాచారం. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉందని.. తన భార్యను చూసేందుకే అజిత్ అజర్ బైజాన్ నుంచి హ‌డావిడిగా చెన్నై వ‌చ్చార‌ని తెలుస్తుంది. అయితే షాలిని కోలుకున్న త‌ర్వాత అజిత్ అజ‌ర్ బైజాన్ వెళ్ల‌నున్నాడ‌ని అంటున్నారు.

ప్ర‌స్తుతం ఆసుప్ర‌తి బెడ్ పై ఉన్న షాలిని చేతులు పట్టుకుని ఉన్న అజిత్ ఫోటోస్ నెట్టింట తెగ వైర‌ల్ అవుతుండ‌గా, ఆమె త్వ‌ర‌గా కోలుకోవాల‌ని అజిత్ అభిమానులు ప్రార్ధిస్తున్నారు. షాలిని 1980లోనే బాలనటిగా చిత్ర పరిశ్రమలోకి అరంగ్రేటం చేసింది. ఆమె 90వ దశకంలో టాలీవుడ్,కోలివుడ్ ఇండ‌స్ట్రీలో ప‌లు సినిమాలు చేసి స్టార్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. మణిరత్నం దర్శకత్వం వహించిన అలై పాయుతే సినిమాతో ఫుల్ క్రేజ్ ద‌క్కించుకున్న షాలిని 1999లో అమర్కలం సినిమా షూటింగ్ సమయంలో అజిత్ తో ప్రేమ‌లో ప‌డింది. ఈ జంట 2000 ఏప్రిల్ 24న వివాహం చేసుకున్నారు. వివాహం తరువాత షాలిని నటన నుండి పూర్తిగా విరమించుకొని ఇంటికే ప‌రిమితం అయింది.

Exit mobile version