Site icon vidhaatha

Akkineni| అక్కినేని కొత్త కోడలు విష‌యంలో అమ‌ల‌, అఖిల్ సైలెంట్… వారికి న‌చ్చ‌లేదా…!

Akkineni| కొద్ది రోజుల క్రితం అక్కినేని కోడ‌లిగా ఉన్న స‌మంత.. చైతూకి విడాకులు ఇచ్చి అంద‌రికి పెద్ద షాక్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఈ షాక్ నుండి అక్కినేని అభిమానులు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు.ఇలాంటి స‌మ‌యంలోనే నాగ చైత‌న్య.. మ‌రో హీరోయిన్ శోభిత దూళిపాళ్ల‌ని ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. గ‌త కొన్నాళ్లుగా వీరిద్ద‌రి మ‌ధ్య రిలేష‌న్ ఉంద‌ని జోరుగా ప్ర‌చారాలు జ‌రుగుతున్నా కూడా ఈ ఇద్దరు స్పందించింది లేదు. కాని సైలెంట్‌గా ఎంగేజ్‌మెంట్ జ‌రుపుకొని పెద్ద షాకే ఇచ్చారు. అయితే చైతూ-శోభిత‌ల ఎంగేజ్‌మెంట్ త‌ర్వాత ప‌లువురు ప‌లు ర‌కాల కామెంట్స్ చేస్తున్నారు. స‌మంత పర్సనల్ స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్ సోష‌ల్ మీడియాలో పెట్టిన పోస్ట్ సంచ‌ల‌నంగా మారింది.

శుభాకాంక్షలు పతిత, ఇప్పుడు అతడు నీ వాడు. రహస్యాలు, అబద్ధాలు బంధాలను నాశనం చేస్తాయి. మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నా దొరికిపోతారు, అంటూ త‌న పోస్ట్‌లో రాసుకొచ్చాడు. ఈ కామెంట్స్ నాగ చైతన్య, శోభితను ఉద్దేశించే అని కొందరు అంటున్నారు. నాగ చైత‌న్య‌- స‌మంత విడిపోవడానికి శోభిత‌నే కార‌ణ‌మ‌ని, స‌మంత‌ని చైతూ మోసం చేశాడ‌ని ఆ బాధ‌లో ప్రీత‌మ్ అలాంటి కామెంట్ పెట్టాడ‌నే టాక్ వినిపిస్తుంది. సమంత-నాగ చైతన్య వైవాహిక జీవితంలో ఏం జరిగిందో ప్రీతమ్ కి అంతా తెలుసు. అందుకే ఆయ‌న ఈ విష‌యాన్ని ఇప్పుడు రివీల్ చేసాడా అని ముచ్చ‌టించుకుంటున్నారు.

ఇక ఇదిలా ఉంటే శోభిత‌- నాగ చైత‌న్య ఎంగేజ్‌మెంట్ త‌ర్వాత అమ‌ల‌, అఖిల్ స్పందించింది లేదు. కొత్త జంట‌తో నాగార్జున ఒక్క‌డే క‌లిసి ఫొటో దిగాడు తప్ప అమ‌ల‌, అఖిల్ క‌నిపించ‌లేదు. వారి పెళ్లి ఈ ఇద్ద‌రికి న‌చ్చ‌లేదా అనే అనుమానాలు కూడా త‌లెత్తుతున్నాయి. నాగార్జున కొత్త కోడ‌లిని త‌న ఇంట్లోకి ఆహ్వానించ‌డం ఆనందంగా ఉంద‌ని చెబుతున్నా అమ‌ల‌, అఖిల్ ల నుండి ఎలాంటి రియాక్ష‌న్ లేక‌పోవ‌డంతో అంతా దాని గురించే చ‌ర్చించుకుంటున్నారు.

Exit mobile version