Site icon vidhaatha

Allari Naresh : అల్లరి నరేష్ కొత్త సినిమా షురూ

Allari Naresh

విధాత : అల్లరి నరేష్ హీరోగా మరో కొత్త సినిమా మెుదలైంది. ఈ సినిమాకు రంభ-ఊర్వశి-మేనక అనే టైటిల్ ఫిక్స్ చేసే అవకాశం వుందని సమాచారం. ప్రస్తుతం టాలీవుడ్‌లో ‘సోషియో ఫాంటసీ సీజన్’ నడుస్తున్న నేపథ్యంలో అల్లరి నరేష్ కూడా అదే కథతో కొత్త సినిమా ప్లాన్ చేసుకున్నారు. ఈ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్, హాస్యా మూవీస్ సంస్థతో కలిసి నిర్మిస్తుంది.

ఇటీవలే అల్లరి నరేష్ 63వ సినిమా ఆల్కహాల్ మూవీ టీజర్ విడుదలైంది. ఫ్యామిలీ డ్రామా ఫేమ్ మెహర్ తేజ్ దర్శకత్వంలో రుహానీ శర్మ, నిహారిక ఎన్ ఎంలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో సత్య, గిరీష్ కులకర్ణి, హర్షవర్ధన్, చైతన్య కృష్ణ, వెంకటేష్ కాకుమాను, కిరీటిలు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. శ్రీకర స్టూడియో సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 జనవరి 1న విడుదల కానుంది. సస్పెన్స్ యాక్షన్ త్రిల్లర్ గా ఆల్కహాల్ సినిమా రూపొందుతుంది. హీరో జీవితాన్ని మద్యం ఎలా ప్రభావితం చేస్తుంది.. మద్యం సేవించాక అతని ప్రవర్తనతో ఎదురైన సంఘటనలతో ఈ సినిమా ఆసక్తికరంగా మలుస్తున్నారు. సినిమాకు సంగీతం గిబ్రాన్ అందిస్తున్నారు. ఈ సినిమాలో షూటింగ్ లో ఉండగానే నరేష్ మరో కొత్త సినిమాను ప్రారంభించుకోవడం ద్వారా వచ్చే ఏడాది ప్రథమార్థంలోనే రెండు సినిమాలతో అలరించబోవడం ఖాయమైంది.

 

Exit mobile version