Allu Ayaan|అల్లు అర్జున్(Allu Arjun) ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. గంగోత్రి సినిమాతో ఇండస్ట్రీకి వచ్చి ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోగా మారాడు. ఇక పుష్ప సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకున్నాడు. పుష్ప సినిమాతో బన్నీ క్రేజ్ ఎల్లలు దాటింది. ఇప్పుడు ఆయన నటించిన పుష్ప2 కోసం ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఆ మూవీని డిసెంబర్ 5న విడుదల చేసేందుకు మేకర్స్ ప్రణాళికలు రచిస్తున్నారు. పుష్ప2 క్రేజ్‌తో థియేట్రికల్, నాన్ థియేట్రికల్ హక్కులను నిర్మాతలు రూ. 1000 కోట్లకు అమ్మారు. మూవీ ఫలితంతో సంబంధం లేకుండా లాభాలు ఆర్జించారు. ప్రాఫిట్ లో షేర్ రెమ్యూనరేషన్ గా అడిగిన అల్లు అర్జున్ కి పుష్ప 2 ద్వారా రూ. 300 కోట్లు తీసుకున్నాడనే టాక్ కూడా ఉంది.
ఇక అల్లు అర్జున్‌కి పుష్ప(Pushpa) చిత్రంతోనే నేషనల్ అవార్డ్ కూడా దక్కింది. ఇప్పటి వరకు టాలీవుడ్ నుండి ఏ హీరో కూడా నేషనల్ అవార్డ్ దక్కించుకోలేకపోయాడు. తొలిసారి పుష్ప చిత్రంతో నేషనల్ అవార్డ్ అందుకొని ఆ ఘనత సాధించిన మొదటి హీరోగా అల్లు అర్జున్ రికార్డులకు ఎక్కాడు. అయితే ఒకప్పుడు అల్లు అర్జున్‌కి మన రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళలోను ఫాలోయింగ్ ఉంది. పుష్పతో నార్త్‌లో కూడా జెండా పాతాడు. ఇటీవల ఓ అభిమాని బన్నీని చూసేందుకు సైకిల్‌పై వెయ్యికి పైగా కిలోమీటర్ల దూరం నుండి హైదరాబాద్ వచ్చాడు. బన్నీ అంటే జనాలలో అంత క్రేజ్ ఉంది.
అయితే బన్నీ కొడుకు అల్లు అయాన్ ఫేవరేట్ హీరో మాత్రం అల్లు అర్జున్ కాదట. ఈ విషయాన్ని అల్లు అయాన్ ఓ షోలో స్వయంగా చెప్పాడట. ఇటీవల అన్ స్టాపబుల్ సీజన్ 4 ఆహా లో మొదలు కాగా, దీనికి తొలి గెస్ట్‌గా చంద్రబాబు నాయుడు(CBN) హాజరు అయ్యాడట.ఇక అల్లు అర్జున్ కూడా షోకి హాజరు అయ్యాడని సమాచారం. షోలో అల్లు అర్జున్ తో అయాన్ కూడా జాయిన్ కాగా, అల్లు అయాన్ ని బాలకృష్ణ నీకు ఇష్టమైన హీరో ఎవరని అడిగాడట. అందుకు సమాధానంగా అల్లు అయాన్… నాకు ప్రభాస్ అంటే చాలా ఇష్టం. ఆయన నా ఫేవరేట్ హీరో అని చెప్పాడట. ప్రభాస్ యాక్షన్ సీన్స్ అదరగొడతాడు. అందుకే నాకు ఇష్టం అని అయాన్ చెప్పాడు. అయాన్ కామెంట్స్‌కి బన్నీ ఖంగు తిన్నాడు.