Allu arjun| టాలీవుడ్ క్యూటెస్ట్ కపుల్ అల్లు అర్జున్, స్నేహా రెడ్డి చాలా మందికి ఆదర్శం. వీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకోగా, వారికి అయాన్, అర్హ సంతానం. ఈ క్యూట్ ఫ్యామిలీని చూసి అభిమానులు ఎంతగానో మురిసిపోతుంటారు.ఇద్దరమ్మాయిలతో సినిమా సమయంలో భార్యపై తనకున్న ప్రేమని బయటపెట్టాడు. సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటే వారు రెండు కళ్లలాంటి వారని అన్నాడు. మరి భార్య ఏంటని అడిగితే ఆమె నా గుండె, అది లేకపోతే జీవితం లేదు. స్నేహా రెడ్డి లేకపోతే నా జీవితమే లేదంటూ చెప్పి భార్యపై తన ప్రేమని తెలియజేశాడు బన్నీ. ఇటీవల జరిగిన ఆర్య 20 ఏళ్ల వేడుకలో కూడా తన భార్య ప్రస్తావన తెచ్చాడు.
తనది వన్ సైడ్ లవ్వే అని చెప్పిన అల్లు అర్జున్.. తను ప్రేమ పంచడమే గాని అక్కడి నుండి రాదని అన్నాడు. అయితే అదంతా సరదాగా బన్నీ చేసిన వ్యాఖ్యలుగా తెలుస్తుంది. ఇక తాజాగా బన్నీ.. తన భార్య స్నేహా రెడ్డికి ఖరీదైన కారుని గిఫ్ట్‌గా ఇచ్చాడట. రెండున్నర కోట్లు పెట్టి ఖరీదైన కారు కొన్న అల్లు అర్జున్ భార్యని ఆ కారుతో సర్‌ప్రైజ్ చేశారట. కొన్ని రోజుల క్రితం బన్నీ దీన్ని బుక్ చేయగా, ఆ కారు ఇంటికి వచ్చింది. అల్లు అర్జున్ కారుని బుక్ చేస్తున్న ఫోటోతోపాటు కారు ఇంటికి వచ్చిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. అయితే తన భార్య కోసం బన్నీ ఖరీదైన కారు బుక్ చేసినట్టు వస్తున్న వార్తలలో నిజమెంత ఉందో తెలియాల్సి ఉంది.
స్నేహా రెడ్డి సినిమాలలో నటించనప్పటికీ సోషల్ మీడియా ద్వారా ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. దాదాపు బన్నీతో సమానంగా ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ భామ. ఇక అల్లు అర్జున్ విషయానికి వస్తే ప్రస్తుతం పుష్ప2`లో నటిస్తున్నారు. ఇటీవల `పుష్ప పుష్ప అంటూ సాగే పాట విడుదల కాగా, దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్‌లో తెగ ట్రెండ్ అయింది. ఆగస్ట్ 15న మూవీ విడుదల కానుండగా, మూవీ ప్రమోషన్ వేగవంతం చేశారు. త్వరలో మరోసాంగ్ కూడా విడుదల చేయనున్నట్టు తెలుస్తుంది. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా, ఫహద్ ఫాజిల్ నెగటివ్ రోల్ చేస్తున్నారు. సునీల్, అనసూయ కీలక పాత్రల్లో కనిపించి అలరించనున్నారు