Allu Arjun|బ‌న్నీ స‌పోర్ట్ చేయ‌క‌పోయినంత మాత్రాన ప‌వ‌న్‌కి వ‌చ్చే న‌ష్టం ఏమి లేదు.. నిర్మాత సంచ‌ల‌న కామెంట్స్

Allu Arjun| నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసిన శిల్పా రవి చంద్రకిషోర్ రెడ్డికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మద్దతు తెలపడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల‌లో హాట్ టాపిక్‌గా మారింది. సొంత కుటుంబ స‌భ్యుడైన పవన్ కల్యాణ్ కి మద్దతుగా ప్ర‌చారంకి వెళ్లలేదు కాని, ఆయ‌న పార్టీకి వ్యతిరేకంగా అల్లు అర్జు

  • Publish Date - May 16, 2024 / 08:25 AM IST

Allu Arjun| నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసిన శిల్పా రవి చంద్రకిషోర్ రెడ్డికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మద్దతు తెలపడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల‌లో హాట్ టాపిక్‌గా మారింది. సొంత కుటుంబ స‌భ్యుడైన పవన్ కల్యాణ్ కి మద్దతుగా ప్ర‌చారంకి వెళ్లలేదు కాని, ఆయ‌న పార్టీకి వ్యతిరేకంగా అల్లు అర్జున్ ప్రచారం చేయడంపై మెగా, పవర్ స్టార్, జనసేన కార్యకర్తలు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. అల్లు అర్జున్ చేసింది ఏ మాత్రం క‌రెక్ట్ కాదు అని తిట్టిపోస్తున్నారు. ఇక మెగా బ్ర‌ద‌ర్ నాగబాబు కూడా దీనిపై ఘాటుగా స్పందించారు. మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మావాడైన పరాయివాడే, మాతో నిలబడేవాడు రాయివాడైన మావాడే…! అంటూ ఇన్‌డైరెక్ట్‌గా ఓ ట్వీట్ చేశారు.

చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ల‌ని అవ‌మానిస్తూ వారిపై ఆరోపణలు చేసేవారికి అల్లు అర్జున్ సపోర్ట్ చేయడం ముమ్మాటికి తప్పే అంటూ కొంద‌రు మండిప‌డుతున్నారు. తాజాగా సీనియర్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ నట్టి కుమార్ కూడా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పిఠాపురం లో పవన్ గెలుపుకు 99 శాతం సపోర్ట్ ఉంది. ఎవరో ఒక కుటుంబ సభ్యుడు సపోర్ట్ చేయపోనంత మాత్రానా ప‌వ‌న్ కళ్యాణ్‌కి ఎలాంటి న‌ష్టం జ‌ర‌గ‌దు. మెగాస్టార్ ఓ మహా వృక్షం.. ఆయన వల్లే మెగా హీరోలంద‌రు ఈ స్థాయిలో ఉన్నారు. అల్లు అర్జున్ కూడా ఆయ‌న స‌పోర్ట్‌తోనే ఎదిగారు. అల్లు అర్జున్ అలా వేరొకరికి సపోర్ట్ గా వెళ్లటం నాకు న‌చ్చ‌లేదు. అది నా వ్య‌క్తిగ‌త విష‌యం. దీనిపై బ‌న్నీ కూడా ఆలోచిస్తే మంచింది. ఆయ‌న ఫొటోని వాడుకొని పార్టీకి అనుగుణంగా తెగ ప్ర‌చారాలు చేసుకున్నారు.

కూటమి సారధ్యంలో కొత్త ప్రభుత్వం వచ్చాక.. సినిమా పరిశ్రమ అభివృద్ధి మెరుగుప‌డుతుంది అని న‌ట్టి అన్నార. ఇక థియేట‌ర్స్ స‌డెన్ గా మూసివేయ‌డంపై కూడా ఆయ‌న మాట్లాడారు. థియేటర్లలో ఆక్యపెన్సీ తగినంత లేని కారణంగా థియేటర్స్ ను బంద్ చేస్తున్నట్లు అసోసియేష‌న్ వారు అంటున్నారు. జూన్ 27వ తేది వ‌ర‌కు పెద్ద సినిమాలు లేవు, అప్పటి వ‌ర‌కు థియేట‌ర్స్ తెర‌వరా అని ఆయ‌న అడిగారు. థియేటర్స్ ఇలా మూసేస్తే ప్రేక్షకులు ఓటిటిలకు మ‌రింత అలవాటుపడతారు. ఒకపని చెద్దాం కల్కీ కి, పుష్ప 2, , ఓజి , దేవర వంటి పెద్ద సినిమాలకు మాత్రమే ధియేటర్స్ ఓపెన్ చేసి, చిన్న సినిమాలు మనకు అవసరం లేదు అని చెబుతున్నారా. వెంటనే అత్యవసర జాయింట్ కమిటి మీటింగ్ ఏర్పాటు చేసి, దీనిపై అందరికీ ఆమోదయోగ్యమైన మంచి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంద‌ని ఆయ‌న అన్నారు.

Latest News