Site icon vidhaatha

Amani | బ‌ట్ట‌లు విప్పి.. చూపించ‌మ‌ని అడిగాడు: ఆమ‌ని సంచ‌ల‌న కామెంట్స్

Amani |

ఆమ‌ని.. ఈ సీనియ‌ర్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.ఎంతో మంది స్టార్ హీరోలతో న‌టించిన ఆమ‌ని వైవిధ్య‌మైన పాత్ర‌ల‌లో న‌టించి మెప్పించింది. ఫ్యామిలీ ఆడియ‌న్స్ మెప్పు పొందిన ఆమ‌ని తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా స‌త్తా చాటుతున్న ఆమ‌ని హీరోయిన్ లకు తల్లిగా నటిస్తూ.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఫుల్ బిజీగా గ‌డుపుతుంది.

జంబలకిడిపంబ చిత్రం ద్వారా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఆమని ఈ సినిమా త‌ర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. తెలుగులోనే కాదు త‌మిళ చిత్రాల‌లో కూడా న‌టించి మంచి గుర్తింపు అందుకుంది.అయితే అడ‌పాద‌డ‌పా ప‌లు ఇంట‌ర్వ్యూలు ఇస్తూ ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డిస్తూ ఉండేది ఆమ‌ని.

ఆమ‌ని తాజా ఇంట‌ర్వ్యూలో క్యాస్టింగ్ కౌచ్ గురించి ఆసక్తిక‌ర కామెంట్స్ చేసింది. సినిమా ప‌రిశ్ర‌మ‌లో హీరోయిన్స్‌కి క్యాస్టింగ్ కౌచ్ స‌మ‌స్య‌లు ఎప్పటి నుండో ఉన్నాయ‌ని చెప్పుకొచ్చింది. సోష‌ల్ మీడియా అప్ప‌ట్లో అంత ప్రాచుర్యం లేక‌పోవ‌డం వ‌ల‌న ఈ విష‌యాలు పెద్ద‌గా వెలుగులోకి రాలేదు.

Aamani | ఆ రోజు.. నా భర్తకి ఎలా కమిటయ్యానో తెలియదు: ఆమని

ఎలాంటి ప్రొఫెష‌న్ అయిన కూడా అందులో మంచి, చెడు రెండు ఉంటాయి. కాక‌పోతే మ‌నం ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటున్నామ‌నేది ముఖ్యం. ఓ సారి ద‌ర్శ‌కుడు ఒక‌రు నా రూమ్ కి వ‌చ్చి స్విమ్మింగ్ ఫూల్ సీన్ తీసే సీన్ ఉందని ,నా బాడీపై మ‌చ్చ‌లు లాంటివి ఏమైన ఉన్నాయేమో చూడాల‌ని అన్నారు. అప్పుడు విష‌యం నాకు అర్ధ‌మై అలాంటి క్యారెక్ట‌ర్స్ చేయ‌న‌ని చెప్పాను అని ఆమ‌ని పేర్కొంది.

కొంత మంది ద‌ర్శ‌కులు స్టోరీ గురించి మాట్లాడాలి, రావాలంటూ ఫోన్ చేసేవారు. అప్పుడు ఈ విష‌యాలు నాకు అంత‌గా అర్ధ‌మయ్యేవి కావు. ఓ డైరెక్ట్ స్టోరీ గురించి మాట్లాడ్డానికి బీచ్ కు రమ్మన్నాడు.ఓ ఫైనాన్షియ‌ర్ మిమ్మ‌ల్ని చూడాల‌ని అనుకుంటున్నాడు అని మేనేజ‌ర్ చెప్పాడు.

అప్పుడు నేను ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కి న‌చ్చాలి గాని, ఫైనాన్షియ‌ర్‌కి న‌చ్చ‌డం ఏంట‌ని అడిగాను. అప్పుడే నాకు అనుమానం వ‌చ్చింది. ఇలాంటి ప‌లు సంఘ‌ట‌న‌లు ఎదుర్కొన్నానంటూ ఆమ‌ని కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ఆమ‌ని చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. తన రంగు గురించి కూడా చాలా మంది వల్గర్ గా మాట్లాడారని ఆమ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది.

Aamani | ఆ రోజు.. నా భర్తకి ఎలా కమిటయ్యానో తెలియదు: ఆమని

Exit mobile version