Site icon vidhaatha

Amitabh Bachchan| క‌ల్కి గ్లింప్స్‌లో యంగ్ లుక్‌లో క‌నిపించిన అమితాబ్.. ఇది ఎలా సాధ్యం అయింది..!

Amitabh Bachchan| ప్ర‌భాస్ ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందుతున్న సినిమాల‌పై అభిమానుల‌లో ఎంత‌టి ఆస‌క్తి ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. స‌లార్ వంటి సూప‌ర్ హిట్ చిత్రం త‌ర్వాత ప్ర‌భాస్ చేస్తున్న చిత్రం క‌ల్కి. భారతీయ సినిమా పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా కల్కి 2898 AD మూవీ రూపొందుతుంది. ఇందులో ప్రభాస్ స‌ర‌స‌న స్టార్ హీరోయిన్ దీపిక పదుకోన్ న‌టిస్తుంది. ఇండియన్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, విలక్షణ నటుడు కమల్ హాసన్ లాంటి ప్రముఖులు మూవీలో ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు.దీంతో మూవీపై అంచ‌నాలు భారీగా పెరిగాయి. ఇక తాజాగా క‌ల్కి మూవీ గ్లింప్స్‌ని ఓ పవిత్రమైన ప్రదేశంలో రిలీజ్ చేశారు. ఈ సినిమా కథ పురాణాలకు సంబంధించినది కావడంతో సినిమా ఫాంటసీ, ఫిక్షన్‌గా చిత్రీక‌రించ‌బ‌డుతున్న నేప‌థ్యంలో అశ్వత్తామ అనే పాత్రకి సంబంధించిన‌ అమితాబ్ బచ్చన్ లుక్‌ని మధ్య ప్రదేశ్‌లోని నేమావార్ ప్రాంతంలో రిలీజ్ చేశారు.

నేమావర్‌లోనే రిలీజ్ చేయడం వెన‌క ఉన్న ప్రత్యేక‌మైన కార‌ణం ఏంటంటే.. ఆ ప్రాంతాన్ని అశ్వత్తామ నడిచిన ప్రాంతంగా భావిస్తారు. ఇంకా ఆయన అక్కడే ఉన్నట్టు ఆ ప్రాంత వాసులు అనుభూతి చెందుతారు. అందుకే అమితాబ్ బచ్చన్ లుక్‌ను అక్కడే రిలీజ్ చేసినట్టు చిత్ర యూనిట్ స్ప‌ష్టం చేశారు. ఈ గ్లింప్స్‌లో మీకు మరణం లేదా.. మీరు భగవంతుడా.. ఎవరు మీరు అని ఓ పిల్లాడు అడుగడంతో… “ద్వాపరయుగం నుంచి దశావతారం కోసం నేను వేచిచూస్తున్నా. గురు ద్రోణాచార్య కుమారుడు అశ్వత్థామను నేను” అని అమితాబ్ బచ్చన్ చెప్పుకొస్తారు. ఒక పురాతమైన దేవాలయంలో ఈ గ్లింప్స్ సాగింది. ఈ గ్లింప్స్‌లో అమితాబ్‌ని చాలా యంగ్‌గా చూపించారు.

అమితాబ్‌ని ఒక్క‌సారిగా అలా యంగ్ లుక్‌లో చూసి అంద‌రు ఆశ్చ‌ర్య‌పోయారు. అయితే డీ-ఏజింగ్ టెక్నాలజీ ద్వారా దర్శకుడు నాగ్అశ్విన్ ఇలా చూపించార‌ని అంటున్నారు.. కోరమీసంతో లాంగ్ హెయిర్‌లో అమితాబ్ యంగ్ లుక్ అందరిని ఆక‌ట్టుకుంది. అమితాబ్ యంగ్‌లో ఉన్న‌ప్పుడు ఎలా ఉండేవారో అలానే ఇప్పుడు చూపించ‌డంతో నాగ్ అశ్విన్ ప్ర‌శంస‌లు అందుకుంటున్నాడు. ఇక ఈ మూవీ భార‌త హిందూ పుర‌ణాల స్పూర్తితో రూపొందుతుంది. కల్కి 2898 ఏడీ సినిమాను మే 9వ తేదీన రిలీజ్ చేయాల‌నుకున్న‌ ఎన్నికల వల్ల వాయిదా పడింది.. గ్లింప్స్‌తో పాటు కొత్త రిలీజ్ డేట్‍ను మూవీ టీమ్ ప్రకటిస్తుందని అంద‌రు ఆశ‌గా ఎదురు చూశారు. కాని ప్రేక్ష‌కుల‌కి నిరాశే ఎదురైంది.

Exit mobile version