Anasuya| ఏపీ డిప్యూటీ సీఎం పదవి దక్కించుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ పూర్తిగా ప్రజా పాలనకే పరిమితం అయ్యారు. ఆయన ఈ మధ్య సినిమాలపై పెద్దగా దృష్టి పెట్టి కనిపించలేదు. అయితే త్వరలో పవన్ తను కమిటైన సినిమాలని పూర్తి చేయనున్నట్టు తెలుస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ సినిమాలో ఆయనతో కలిసి ఓ సాంగ్‌కి డ్యాన్స్ చేసిన విషయాన్ని రివీల్ చేసి ఫ్యాన్స్‌కి మాంచి కిక్ ఇచ్చింది అనసూయ. ఓ ఛానల్‌లో ప్రసారం అవుతున్న ‘కిర్రాక్ బాయ్స్ ఖిలాడి గర్ల్స్’ లేటెస్ట్ ప్రోమోలో ఆసక్తికరమైన అప్డేట్‌ని రివీల్ చేసింది యాంకర్ అనసూయ.
‘‘ఫస్ట్ టైం ఈ విషయాన్ని రివీల్ చేస్తున్నా.. ఈ విషయాన్ని చాలా గర్వంగా చెప్తున్నా.. నేను పవన్ సార్‌తో ఒక బ్యూటిఫుల్ డాన్స్ నెంబర్ (పాట) చేశాను. ఆ పాట మోత మోగిపోతుంది అంటూ అనసూయ ఓ రేంజ్‌లో ఎలివేషన్స్ ఇవ్వడంతో ఇప్పుడు అందరు కూడా ఆ పాట ఏంటి, సినిమా ఏంటి అనే దానిపై చర్చలు జరుపుతున్నారు. తాజా సమాచారం ప్రకారం హరిహర వీరమల్లు సినిమాలో పవన్‌తో కలిసి అనసూయ డ్యాన్స్ చేయనుందని టాక్.. వాస్తవానికి అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కల్యాణ్‌తో కలిసి అనసూయ ఓ పాటలో స్టెప్పులు వేయాల్సి ఉండేది. కానీ ప్రెగ్నెన్సీ కారణంగా చేయలేకపోయినట్టు అప్పట్లో టాక్ వినిపించింది.
ఇప్పుడు ఛాన్స్ రావడంతో అనసూయ ఏ మాత్రం ఆలోచించకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే ఆ పాట షూటింగ్ కూడా పూర్తైనట్టు తెలుస్తుంది. మేకర్స్ కూడా త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ ఇవ్వనున్నారని అర్ధమవుతుంది. అనసూయ ఒకప్పుడు యాంకర్‌గా అదరగొట్టి ఆ తర్వాత సినిమాలలో సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తూ వస్తుంది. కొంత గ్లామర్, హై రేంజ్‌లో స్కీన్ షో పాత్రలతో మెప్పించిన ఈ అమ్మడు రంగస్థలం, పుష్ప, విమానం లాంటి సినిమాల్లో ప్రేక్షకులను ఉద్వేగాలకు గురిచేసే పాత్రలో కనిపించి తనలోని నటిని బయటపెట్టింది. ఇక అడపాదడపా ఐటెం సాంగ్స్‌లో కూడా మెరుస్తూ సందడి చేస్తుంది.