Site icon vidhaatha

Anasuya | ర‌ష్మీ గొడ‌వ‌లో అన‌సూయ పేరు.. ప్రేవేట్ పార్ట్స్ గురించి చెబుతూ నెటిజ‌న్‌కి చుర‌క‌లు

Anasuya

బుల్లితెర యాంకర్స్ ర‌ష్మీ, అన‌సూయలు జ‌బ‌ర్ధ‌స్త్ షోతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి చాలా ద‌గ్గ‌ర‌య్యారు. అన‌సూయ జ‌బ‌ర్ధస్త్ షో చేస్తే, ర‌ష్మీ ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ధ‌స్త్ షో చేసేది. వీరిద్ద‌రు షోల‌కి మంచి రేటింగ్‌లు వ‌చ్చేవి. ఇక ఈ షోల ద్వారా అన‌సూయ‌, ర‌ష్మీల మ‌ధ్య కూడా మంచి స్నేహం ఏర్ప‌డింది.

అయితే అన‌సూయ జ‌బ‌ర్ధ‌స్త్‌కి గుడ్ బై చెప్పిన కొన్ని రోజుల పాటు ర‌ష్మీనే జ‌బ‌ర్ధ‌స్త్‌, ఎక్స్ ట్రా జ‌బ‌ర్ధ‌స్త్ షోల‌ని హోస్ట్ చేసింది. ఇక‌ ర‌ష్మీలో సామాజిక కోణం కూడా ఉంద‌నే విష‌యం మ‌న‌కు తెలిసిందే. ముఖ్యంగా జంతువుల‌పై ఎలాంటి హింస జరిగిన కూడా వెంట‌నే స్పందిస్తూ ఉంటుంది. ఈ క్ర‌మంలో అనేక మార్లు విమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొంటుంది.

ఇటీవ‌ల బ‌క్రీద్ పండుగ జ‌ర‌గ‌గా, ఆ రోజు ముస్లింలు త‌మ మ‌తాచారంలో భాగంగా పెద్ద ఎత్తున జంతువుల‌ని బ‌లి ఇచ్చారు. దీనిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ ర‌ష్మీ ట్వీట్ చేసింది. దీంతో ర‌ష్మీపై కొంద‌రు మండి ప‌డ్డారు. వారికి ధీటుగానే బ‌దులిచ్చింది.

అయితే ఈ చ‌ర్చ‌ మతాలలో ఉన్న కుల వివక్ష వ‌ర‌కు వెళ్లింది. ఇక ఇంత రచ్చ న‌డుస్తున్న స‌మ‌యంలో ఓ నెటిజన్.. అనసూయని మ‌ధ్య‌లోకి లాగుతూ.. ర‌ష్మీ ఇలాంటి విష‌యాల‌పై చాలా ధైర్యంగా మాట్లాడు తుంది. మీరు ఎందుకు మౌనంగా ఉంటారు అని విమ‌ర్శించాడు. దీంతో రంగ‌మ్మ‌త్త కోపం క‌ట్ట‌లు తెంచుకుంది.

త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా ప‌రుష జాలంతో నెటిజ‌న్ పై మండిప‌డింది. ‘హలో.. మిమ్మల్ని కాస్త‌ సరి చేయనిస్తారా… నాకు ‘బాల్స్స అయితే లేవు, కానీ అవగాహన ఉన్న అంశాలపై ధైర్యంగా మాట్లాడేందుకు ‘వజైనా’ ఉంది అని ప్రేవేట్ పార్ట్స్ ని ఉద‌హ‌రిస్తూ కాస్త బోల్డ్ కామెంట్ పెట్టింది.

మ‌న‌కు మాట్లాడాలనిపించ‌న‌ప్పుడు మాట్లాడ‌తాం. ఏ విష‌యాల‌పై మాట్లాడాలి, ఏ విష‌యాలపై మాట్లాడొద్దు అనేది వారి వారి అభిప్రాయం. అన్ని అంశాల‌పై అంద‌రు స్పందించాల‌ని అనుకోవ‌డం మంచిది కాదు అంకుల్ అంటూ అనసూయ స‌ద‌రు నెటిజ‌న్‌కి దిమ్మ‌తిరిగే కౌంట‌ర్ ఇచ్చింది. కాగా, అన‌సూయ కొద్ది రోజుల క్రిత‌మే రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్యాన్స్‌తో గొడ‌వ‌కి పులిస్టాప్ పెట్టిన విష‌యం తెలిసిందే.

Exit mobile version