Anchor Anasuya Bharadwaj Warning | విధాత : హాట్ యాంకర్ అనసూయ ఆగ్రహంతో ఊగిపోయింది. చెప్పుతో కొడతానంటూ యువకులకు వార్నింగ్ ఇచ్చింది. ఈ ఘటన ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో చోటుచేసుకుంది. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం కోసం వచ్చిన అనసూయను చూసేందుకు భారీగా అభిమానులు, యవకులు తరలివచ్చారు.
మాల్ ప్రారంభోత్సవం అనంతం మాట్లాడుతున్న అనసూయను చూస్తూ కొందరు యువకులు అసభ్యకర కామెంట్స్ చేశారు. దీంతో ఆగ్రహించిన అనసూయ వారికి చెప్పు తెగుద్దని..మీ వద్ధకు వచ్చి కొట్టమన్నా కొడుతానని సున్నితంగానే వార్నింగ్ ఇచ్చారు. మీ అమ్మ, అక్కాచెల్లెళ్లను, మీకు రాబోయే పెళ్లాలను ఇలాగే మాట్లాడితే మీకు నచ్చుతుందా అంటూ ప్రశ్నించారు. మీ ఇంట్లో వాళ్లను ఇలాగే ఏడిపిస్తే మీకు నచ్చుతుందా ? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దవాళ్లకు మర్యాద ఇవ్వడం మీ ఇంట్లో నేర్పలేదా?” అని మండిపడ్డారు. మీలాంటి వారు సమాజానికి అవసరం లేదని..మీరు చాల చిన్న పిల్లలని..మీరు ఇప్పుడే ఇలా ఉన్నారంటే..మునుముందు ఎలా ఉంటారోనంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అనసూయ తన వ్యాఖ్యలలో కేవలం కోపాన్ని మాత్రమే కాకుండా, బాధను కూడా వ్యక్తం చేశారు.
మీలాంటి వాళ్లు ఇలాంటి కార్యక్రమాలకు రానవసం లేదన్నారు. తాను చాలా ఇష్టంతో, ఎంతో దూరం ప్రయాణం చేసి ప్రజల కోసం ఈ కార్యక్రమానికి వచ్చానని, ఇలాంటి ప్రవర్తన సరికాదని ఆమె హితవు పలికారు. ఈ చెడు బ్యాచ్ ను వెనక్కి పంపించి మహిళలను ముందుకు పంపించాలంటూ నిర్వాహకులను కోరారు. ఇంతలో అక్కా అంటూ వారిలో ఒకరు పిలవడంతో అలా ఉండాలంటూ తన ప్రసంగం కొనసాగించారు.
తరుచు సామాజిక మాధ్యమాల్లో హాట్ ఫోటోలను షేర్ చేసే అనసూయ ఈ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి నిండైన భారతీయత, తెలుగుదనం ఉట్టిపడేలా చీరకట్టుతో హాజరయ్యారు. అయినా అకతాయి యువకులు కొందరు అసభ్యకర కామెంట్లు చేయడంతో అనసూయ వారికి వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చింది.
