Site icon vidhaatha

యాంకర్​ శ్యామల పేరు బాగా ‘నానుతోంది’

యాంకర్​ శ్యామల(Anchor Shyamala)… తెలుగు టీవీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. అంతగా దగ్గరయింది. ఝాన్సీ, సుమ, అనసూయ తర్వాత అంత పాపులారిటీ సంపాదించుకున్న యాంకర్​, నటి ఈవిడే. ఆ పాపులారిటీలో పాజిటివ్​ నెగటివ్​లు కూడా ఉన్నాయి. అసలు ఇండస్ట్రీలోకి నటిగానే అడుగుపెట్టింది శ్యామల. ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’, గోరింటాకు, అభిషేకం, లయ వంటి సీరియల్స్‌లో నటించింది. ఆ సీరియల్స్‌లో చేసేటప్పుడే నటుడు నరసింహారెడ్డితో పరిచయం ఏర్పడి.. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఇక నటిగా మెప్పిస్తూనే యాంకర్‌గానూ చాలా టీవీ షోలకు హోస్టింగ్ చేసింది. పట్టుకుంటే పట్టుచీర, మా ఊరి వంట (Maa voori vanta)వంటి కార్యక్రమాలు యాంకర్ శ్యామలకి మంచి పేరు తెచ్చాయి.

ఇక సినిమా ఈవెంట్లు, ఆడియో ఫంక్షన్ల, మూవీ ప్రమోషన్స్ ఇంటర్వ్యూలలో యాంకర్ శ్యామల తరచుగా కనిపిస్తూ ఉంటుంది. అంతేకాదు.. బిగ్ బాస్ సీజన్ 2(Biggboss2) కంటెస్టెంట్‌గానూ హౌస్‌లోకి వెళ్లింది యాంకర్ శ్యామల. ఒకసారి ఎలిమినేట్ అయ్యి.. ఆ తరువాత వైల్డ్ కార్డ్ ఎంట్రీతో రెండోసారి బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లింది యాంకర్ శ్యామల. తనతో ఒకరోజు ప్రొగ్రాం అంటే దాదాపు 25 లక్షల దాకా చార్జ్​ చేస్తుందని వినికిడి.తన ఇన్​స్టాగ్రామ్​ అకౌంట్​లో అందమైన హాట్​ ఫోటోలతో మత్తెక్కిస్తుంటుంది శ్యామల.

ఆ మధ్య నీలిచిత్రంలో నటించిందంటూ ఓ విడియో సోషల్​ మీడియాలో విపరీతంగా తిరిగింది. శ్యామల యథావిధిగా అది తనది కాదని, మార్ఫింగ్​ చేసారని వాపోయింది. తన భర్త నరసింహారెడ్డి గొప్పవాడు కాబట్టి, తనను అర్థం చేసుకున్నాడని లేకపోతే తన పరిస్థితి ఏమిటని విలపించింది. అన్నట్లు ఈ నరసింహారెడ్డి మీద కూడా క్రిమినల్​ కేసులున్నాయి. ఒక వెంచర్​ మొదలుపెడదామని ఒకావిడ దగ్గర 80 లక్షలు తీసుకున్నాడని ఆమె పోలీస్​ కంప్లయింట్​ ఇచ్చింది కూడా. ఏదేమైనా శ్యామల సంపాదనలో కూడా తగ్గలేదు. రెండు ఇళ్లు, విలాసవంతమైన కార్లతో ఏ హీరోయిన్​కూ తగ్గకుండా రెండు చేతులా బాగానే సంపాదిస్తోంది. హైదరాబాద్​ ఎలైట్​ సర్కిళ్లలో కూడా శ్యామల చాలా ఫేమస్​. పార్టీలు, పబ్బులూ అంటూ లేట్​నైట్​ షోలలో కూడా బాగానే కనబడుతుందని కళాభిమానులు చెపుతుంటారు.

ఇప్పుడు వైసీపీలో చేరి, ప్రచారంలో దూసుకెళ్తోంది. రెండు రోజుల క్రితం ప్రచారంలో భాగంగా, చంద్రబాబునూ, పవన్​కళ్యాణ్​నూ కించపరుస్తూ, ఓ కుందేలు కథ చెప్పింది. ఆ కథ బాగా వైరల్​ కూడా అయింది. దాంతో జనసేన, టీడీపీ నుంచి 30 ఇయర్స్​ పృథ్వీ(30 years Prudhvi), ఉండవల్లి అనూష(Undavalli Anusha), శ్యామలను ఓ రేంజ్​లో ఆడేసుకున్నారు. నీ చీకటి బాగోతాలు, నీ మొగుడి అరాచకాలు మొత్తం బయటపెడతానని అనూష హెచ్చరించింది. అయినా స్వతహాగా యాంకర్​, ప్రజెంటర్​ కావడంతో అనర్గళంగా మాట్లాడుతూ ప్రచారం నిర్వహిస్తోంది. ఒకవేళ వైసీపీ గెలిస్తే శ్యామలకు ఏ పదవిస్తోరోనని ఆంధ్రప్రదేశ్​ ప్రజలు పాపం..బాగా వర్రీ అవుతున్నారు.

Exit mobile version