Anchor Shyamala| ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంపైనే అందరి దృష్టి ఉంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుండి పోటీ చేస్తుండడంతో ఆయన ఎంత మెజారిటీతో గెలుస్తారు అని ప్రతి ఒక్కరు కూడా జోరుగా చర్చలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో రెండుసార్లు ఓటమి చవి చూసిన పవన్ కల్యాణ్ ఈ సారి ఏ రేంజ్ విజయాన్ని సాధిస్తున్నారనే ఆసక్తి నెలకొంది. ఇక ఆయన తరపున ఈ సారి భారీ ఎత్తున పలువురు సెలబ్రిటీలు ప్రచారాలు చేశారు. ఇంకొందరు సోషల్ మీడియా వేదికగా మద్దతు తెలియజేశారు. మరి కొందరు దారుణమైన విమర్శలు కూడా చేశారు. వారిలో యాంకర్ శ్యామల ఒకరు.
పవన్ కళ్యాణ్‌కి పోటీగా వైసిపి నుండి వంగా గీతా పోటీ చేస్తున్నారు. ఈ క్రంలో వైసిపి పార్టీ తరఫున ప్రచారంలోకి దిగిన ప్రముఖ యాంకర్, సినీ నటి అయిన శ్యామల ..మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పై సెటైర్లు వేశారు. చెప్పేవాళ్లు ఎన్నైన చెబుతారు. కాని గ్రౌండ్ లెవల్ లో ఏం జరుగుతుందో జనాలకి తెలుసు. పిఠాపురంలో వైసీపీ గెలుపు ఖాయం. వంగా గీత రాజకీయ ప్రస్థానం చూస్తే ఆవిడ ఏ స్థాయి నుండి ఈ స్థాయికి వచ్చింది. ఆమె తన చుట్టు ప్రజలకి చేతనంత సాయం చేసింది. ఇప్పుడు అలాంటి స్ట్రాంగ్ క్యాండిడేట్ ని కొట్టాలంటే పవన్‌కి అందరి సపోర్ట్ అవసరం. అందుకే అందరిపై ఒత్తిడి తెచ్చి ప్రచారం చేయించుకుంటున్నార.
వంగా గీత గెలుపు పిఠాపురంలో ఎప్పుడో కన్‌ఫాం అయింది. భారీ మెజారిటీతో ఆమెను గెలిపించడానికే నేను పిఠాపురంలో ప్రచారం చేశానంటూ శ్యామల పేర్కొంది. అయితే ఈ అమ్మడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టక ముందు కొన్ని వ్యాఖ్యలు చేసింది. పవన్ రాజకీయాలలోకి వస్తున్నాడని తెలియడంతో ఆమె ఒక బైట్ ఇచ్చింది. పవన్‌కి తాను ఫ్యాన్ కాదు. కాని ఆయన చేసే మంచి పనులు, చారిటీ కార్యక్రమాలు అన్నీ తెలుసుకున్న తర్వాత పెద్ద ఫ్యాన్ అయ్యానంటూ పేర్కొంది. అలాంటి గొప్ప వ్యక్తి రాజకీయాలలోకి వస్తే ప్రజలకి ఎంతో మంచి జరుగుతుంది అని చెప్పింది. అప్పుడు అలా మాట్లాడిన శ్యామల ఇప్పుడు ప్లేట్ ఫిరాయించడం వెనక కారణమేంటని ప్రశ్నిస్తున్నారు..