టాలీవుడ్ యాంకర్ శ్యామల భర్త నర్సింహారెడ్డి పై రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదు నమోదైంది. నర్సింహారెడ్డి తన వద్ద 2017లో కోటి రూపాయలు తీసుకున్నాడని, డబ్బులు చెల్లించమని అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నాడని, లైంగిక వేధింపులకు గురి చేశాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఈ వ్యవహారంలో సెటిల్‌మెంట్ చేసుకోవాలంటూ నర్సింహారెడ్డి తరపున మరో మహిళ రాయభారం నడిపిందని కూడా మహిళ తన ఫిర్యాదులో పేర్కొనడంతో కేసు నమోదు చేసుకున్న రాయదుర్గం పోలీసులు…నర్సింహారెడ్డితో పాటు రాయబారం నడిపిన మహిళను అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు.