Gangavva|మై విలేజ్ షోతో యూట్యూబర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న గంగవ్వ(Gangavva) ఆ తర్వాత బుల్లితెర, వెండితెరపై కనిపించి అశేష ప్రేక్షకాదరణ దక్కించుకుంది. ఇక బిగ్ బాస్ లోకి కూడా వెళ్లి తెగ వినోదం పంచింది. సీజన్ 4లో చాలా హుషారుగా కనిపించిన గంగవ్వ ఆ తర్వాత అక్కడి వాతావరణం తట్టుకోలేక అనారోగ్యంతో బయటకు వచ్చేసింది. ఇక ఈ సీజన్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం కంటెస్టెంట్స్‌తో హుషారుగానే ఉన్న గంగవ్వకు గుండెపోటు వచ్చిందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఆమె పరిస్థితి చూసి అందరు షాక్ అయ్యారని, వైద్యులు కూడా హౌజ్‌లోకి వచ్చి ట్రీట్‌మెంట్ అందించారంటూ అనేక ప్రచారాలు సాగాయి.
అయితే ఈ వార్తలకి మై విలేజ్ షో అనీల్(Anil) చెక్ పెట్టారు. ఆమె ఆరోగ్యంగానే ఉంది. దయచేసి తప్పుడు ప్రచారాలు చేయకండి. గంగవ్వ ఆట మీకు ఎలా అనిపిస్తుంది అని అనీల్ తన ఇన్‌స్టాలో గంగవ్వతో దిగిన ఫొటో షేర్ చేస్తూ కామెంట్ పెట్టాడు. ప్రస్తుతం ఈ వార్త వైరల్‌గా మారింది. ఇక ఇదిలా ఉంటే గంగవ్వ తాజా ఎపిసోడ్‌లో లివింగ్ రూమ్‌లోని సోఫా మీద కూర్చోని పెద్ద పెద్దగా అరుస్తూ దయ్యం పట్టినట్లుగా ఊగిపోయింది. దీంతో కంటెస్టెంట్లు ఒక్కొక్కరు హడావిడిగా వచ్చి గంగవ్వను చూసి హడలెత్తిపోయారు. నయని పావని అయితే “స్టోర్ రూమ్ కెమెరా ప్లీజ్ రెస్పాండ్” అంటూ ఆందోళన చెందింది. దగ్గరకు వచ్చిన రోహిణిని సైతం భయపెట్టింది గంగవ్వ.
ఘోస్ట్లాగా ఎలా నటించాలో గంగవ్వకు టేస్టీ తేజ వివరించాడు. తేజ, అవినాష్, గంగవ్వ ఈ ముగ్గురు ప్రాంక్ ప్లాన్ చేయగా, ఈ విషయం తెలియని హౌజ్‌మేట్స్ మాత్రం తెగ భయపడిపోయారు. ఇక ఇదిలా ఉంటే హౌజ్‌లో ఉన్న గంగవ్వపై కేసు నమోదైంది. 2022 మే నెలలో తీసిన ఓ వీడియోలో చిలుకను ఉపయోగించడం పైన గంగవ్వ పైన పోలీసులకు ఫిర్యాదు చేశారు. గంగవ్వ తో పాటు యూట్యూబర్ రాజు చిలకParrot) జ్యోతిష్యం చెప్పించుకున్నట్టు చేసిన వీడియోతో చిలుకను ఉపయోగించి దానిని హింసించి, వన్యప్రాణుల రక్షణ చట్టాన్ని ఉల్లంఘించారని గౌతమ్ అనే వ్యక్తి అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశాడు. వినోదం కోసం చిలుకని హింసించడం చట్ట ఉల్లంఘన క్రిందకు వస్తుందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో జగిత్యాల అటవీశాఖ అధికారులు గంగమ్మ తో పాటు, యూట్యూబ్ రాజు పైన కూడా కేసు నమోదు చేశారు. మరి ఈ కేసు విషయం ఎంత వరకు వెళుతుందో చూడాలి.