విధాత: కేజీఎఫ్’ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా చేయబోతున్నారని ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. నేడు(మే 20) పుట్టిన రోజు సందర్భంగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. ‘రక్తంతో తడిసిన నేల ఒక్కటి మాత్రమే గుర్తుంచుకుంటుంది, ఒకే ఒక్క ఫోర్స్ ఎన్టీఆర్‌తో సినిమా చేసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’ అంటూ ప్రశాంత్ నీల్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ , నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. మరచిపోలేని ప్రయాణంలో ఇద్దరు బలవంతులు జత కలిశారంటూ ట్వీట్ చేసింది మైత్రి మూవీ మేకర్స్.