Site icon vidhaatha

Ghaati Glimpse Release : అనుష్క ‘ఘాటి’ నుంచి గ్లింప్స్ రిలీజ్

Ghati Movie Anushka

విధాత : స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి(Anushka Shetty) పవర్ ఫుల్ పాత్రలో నటించిన ‘ఘాటి’(Ghaati) మూవీ రేపు శుక్రవారం విడుదల కానుంది. సినిమా ప్రమోషన్ లో భాగంగా మేకర్స్ గురువారం మూవీకి సంబంధించి ప్రత్యేకంగా రూపొందించిన గ్లింప్స్ ను విడుదల చేశారు. ఈ గ్లింప్స్ ను రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) చేతుల మీదుగా విడుదల కావడం గమనార్హం. గ్లింప్స్ లో అనుష్క యాక్షన్స్ సీన్స్ లో..పవర్ ఫుల్ డైలాగ్ లతో అదరగొట్టారు.

విజువల్స్ గ్రాండియర్, నేపథ్య సంగీతం అన్నికూడా సినిమాపై అంచ‌నాలు పెంచేస్తున్నాయి. ‘ఘాటి’ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల చేయనున్నారు. పాన్ ఇండియా మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ క్రిష్(Krish) దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్(First Frame Entertainments) సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.

ఈ సినిమాలో అనుష్కతో పాటు విక్రమ్ ప్రభు(Vikram Prabhu), జ‌గపతి బాబు(Jagapathi Babu), జిషు సేన్‌గుప్తా(Jisshu Sengupta) తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వేదం తర్వాత అనుష్క-క్రిష్ కాంబినేషన్‌లో వస్తున్న ప్రాజెక్ట్ కావడంతో ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ‘వేదం’ వంటి క్లాసిక్ తర్వాత ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న సినిమా ఎలా ఉంటుందోనని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఆంధ్ర–ఒడిశా సరిహద్దులోని తూర్పు కనుమలలో గంజాయి సాగు వృత్తిగా జీవించే ప్రజలు..అనంతర కాలంలో ఎదుర్కొన్న పరిస్థితులతో ‘ఘాటి’ సినిమాను రూపొందించారు.

Exit mobile version