Arjun Das: ఓజీ స్టార్‌తో.. ఐశ్వర్య లక్ష్మి ప్రేమాయ‌ణం నిజ‌మేనా?

కోలీవుడ్‌ నటుడు అర్జున్‌ దాస్‌, మలయాళ హీరోయిన్‌ ఐశ్వర్య లక్ష్మి మధ్య ప్రేమ గుసగుసలు మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి. బాలాజీ మోహన్‌ దర్శకత్వంలో వస్తున్న వెబ్‌సిరీస్‌లో వీరిద్దరూ కలిసి నటించడం ఈ రూమర్స్‌కి కారణమని సినీ వర్గాల చర్చ.

కోలీవుడ్‌లో మరోసారి రొమాన్స్‌ గాసిప్‌ హల్‌చల్‌ చేస్తోంది. ప్రత్యేకమైన బేస్‌ వాయిస్‌తో, విలక్షణమైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న అర్జున్‌ దాస్ (Arjun Das), మలయాళ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మి (Aishwarya Lakshmi) ప్రేమలో ఉన్నారనే వార్తలు మ‌రోసారి హాట్ టాపిక్‌గా మారింది.

ఇటీవ‌ల బాంబ్ అనే త‌మిళ సినిమాలో హీరోగా, ప‌వ‌న్ క‌ల్యాణ్ ఓజీలో కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించి ప్రేక్ష‌కుల నుంచి మంచి గుర్తింపును ద‌క్కించుకున్నాడు. అదేవిధంగా తెలుగులో గాడ్సే సినిమాతో అల‌రించిన ఐశ్వ‌ర్య ప్ర‌స్తుతం సాయి ధ‌ర‌మ్ తేజ్ సంబ‌రాల ఎటిగ‌ట్లు మ‌రో రెండు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.

అయితే.. ఇప్పటికే ఈ ఇద్దరి మధ్య అనుబంధం గురించి గుసగుసలు రాగానే, అర్జున్‌ దాస్ ఈ వార్త‌ల‌ను స్పష్టంగా ఖండించగా, ఐశ్వర్య లక్ష్మి కూడా తామిద్దరం కేవలం మంచి స్నేహితులమని చెప్పింది. అయితే తాజా ప్రచారం వెనుక కారణం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

త‌మిళంలో ‘కాదలిల్‌ సొదుప్పదు ఎప్పడి’ ఫేం దర్శకుడు బాలాజీ మోహన్ తెరకెక్కిస్తున్న కొత్త వెబ్‌సిరీస్‌లో వీరిద్దరూ కలిసి నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ వల్లే మళ్లీ లవ్‌ ట్రాక్‌ గాసిప్స్‌ పుంజుకున్నాయి. “నిప్పు లేకుండా పొగ రాదు” అన్న సామెతను ప్రస్తావిస్తూ, నిజంగానే వీరిద్దరి మధ్య స్పెషల్‌ కనెక్షన్‌ ఉందేమోనని కొందరు సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.

సినిమాల్లోకి రాకముందు అర్జున్‌ దాస్‌ బ్యాంకు ఉద్యోగి, రేడియో జాకీగా పని చేశారు. ఇక ఐశ్వర్య లక్ష్మి మాత్రం వైద్య విద్య పూర్తిచేసి, ఆ తర్వాత గ్లామర్‌ ఫీల్డ్‌లోకి వచ్చి వరుస విజయాలతో టాలీవుడ్‌, కోలీవుడ్‌ రెండింట్లోనూ తనకంటూ మంచి క్రేజ్‌ సంపాదించుకుంది.

Exit mobile version