Ashika Ranganath Gatha Vaibhava Teaser Release | అషికా రంగనాథ్ సినిమా వచ్చేస్తుంది

అషికా రంగనాథ్ ప్రధాన పాత్రలో వస్తున్న 'గత వైభవ' టీజర్ రిలీజ్ అయింది. నవంబర్ 14న సినిమా విడుదల కానుంది.

Ashika Ranganath

విధాత : అందాల తార అషికా రంగనాథ్ సినిమా గత వైభవ నుంచి టీజర్ వచ్చేసింది. అషికా, ఎస్ఎస్.దుశ్యంత్ ప్రధాన పాత్రల్లో..దర్శకుడు సింపుల్ సుని రూపొందించిన గత వైభవ సినిమా నవంబర్ 14న విడుదల కానుంది. సినిమా ప్రమోషన్ లో భాగంగా తాజాగా విడుదలైన టీజర్ లో..నువ్వు ఏ జన్మలో పుట్టినా నీకు గాంధర్వ సంగమం దక్కదు, ఇది అనామ దేవుడి శాపం అంటూ డైలాగ్ తో సాగుతుంది. టీజర్ చూస్తే గత వైభవ సినిమా పురాణ కథతో కూడిన ఫాంటసీగా రాబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాను సర్వ్‌గర సిల్వర్ స్క్రీన్స్, సుని సినిమాస్ బ్యానర్లపై దీపక్ తిమ్మప్ప, సుని సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి జుడా సంధి సంగీతమందించగా.. విలియం జె డేవిడ్ సినిమాటోగ్రఫీ అందించారు.

నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా వచ్చిన అమిగోస్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అషికా రంగనాథ్ అక్కినేని నాగార్జున నా సామిరంగ సినిమాలో నటించి మెప్పించింది. చాల గ్యాప్ తర్వాత అషికా నటించిన గత వైభవ సినిమా విడుదలకు సిద్దమవుతుంది. మధ్యలో అషికా నటించిన మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర వచ్చే వేసవికి వాయిదా పడటంతో గత వైభవ మూవీతోనే ఆమె ముందుగా ప్రేక్షకులను పలకరించనుంది. చిత్రంగా ఈ రెండ సినిమాలు కూడా ఫాంటసీ జోనర్ లోనే రానుండటం అషికా కెరీర్ లో పత్యేకంగా నిలవనుంది.

 

Exit mobile version