Site icon vidhaatha

క‌రోనాపై అవికాగోర్‌ ఆవేద‌న‌

అవికా కరోనా విజృంభణను చూసి భయపడిపోతోంది. ఈ మేరకు సోషల్‌ మీడియాలో సుదీర్ఘ లేఖను షేర్‌ చేసింది.
“బయట పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. అధికారిక లెక్కల ప్రకారం కరోనా వల్ల దాదాపు 2 లక్షల మంది చనిపోయారు. కానీ ఈ సంఖ్య నాలుగైదు రెట్లు ఎక్కువే ఉండి ఉంటుంది. 17 మిలియన్ల మంది వైరస్‌ బారిన పడ్డారు. వారిలో చాలామంది భవిష్యత్తులోనూ అనారోగ్యంతో బాధపడే అవకాశం ఉంది.

ఈ కరోనాను డీల్‌ చేయడం వైద్యారోగ్య విభాగానికి తలకు మించిన భారంగా మారింది. కాబట్టి ఈ వైరస్‌ను నియంత్రించేందుకు మనం చేయగలిగేదంతా చేద్దాం..
నా కుటుంబం కూడా దీనితో పోరాడింది. నాకు చాలా భయమేసింది. కానీ ఈ పోరాటంలో వాళ్లు విజయం సాధించారు. కానీ ఎవరికీ ఇలాంటి పరిస్థితులు రావద్దు. కరోనాను జయించిన వాళ్లు దయచేసి ప్లాస్మాదానానికి ముందుకు రండి. అందరూ వ్యాక్సిన్‌ వేయించుకోండి. ఇది మిమ్మల్ని వైరస్‌ బారిన పడకుండా ఆపలేదు కావచ్చు, కానీ అది మీకు చేసే హానిని తగ్గిస్తుంది.
మిమ్మల్ని వేడుకుంటున్నాను.

అత్యవసరమైతేనే కాలు బయట పెట్టండి, ఇంట్లోనే ఉండండి. మనందరం ఏకమై దానితో పోరాడుదాం. ఇప్పటికే ఒకసారి జయించాం. మరోసారి గెలుస్తామన్న నమ్మకం కూడా ఉంది. నేను మీకు మాటిస్తున్నా.. కరోనా నుంచి విముక్తి కోసం నాకు చేతనైనంత కృషి చేస్తాను” అని అవికా గోర్‌ చెప్పుకొచ్చింది.

Exit mobile version