Site icon vidhaatha

Avika Gor| అవికాగోర్‌తో రెచ్చిపోయి డ్యాన్స్ చేసిన ఆండ్రీ ర‌స్సెల్.. అందాల‌ని బాగా ఆస్వాదించాడు..!

Avika Gor|  బాలనటిగా స్మాల్ స్క్రీన్ కి ఎంట్రీ ఇచ్చిన అవికా గోర్ ఆ త‌ర్వాత క‌థ‌నాయిక‌గా మారింది. హిందీలో బాలికా వ‌ధు అనే సీరియ‌ల్ రాగా, అందులో న‌టించింది. ఇక ఈ సీరియల్ నే తెలుగులో ‘చిన్నారి పెళ్లికూతురు’ గా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇందులో ఆనందిగా త‌న న‌ట‌న‌తో క‌ట్టిప‌డేసింది. ఇక ఉయ్యాల జంపాల అనే సినిమాతో ఈ భామ క‌థానాయిక‌గా కూడా మారింది.ఇందులో అవికా అద్భుతమైన నటనకు గాను మంచి మార్కులు ప‌డ్డాయి. ఇక అనేక మూవీ అవ‌కాశాలు కూడా వ‌చ్చాయి. ఈ క్రమంలోనే ‘సినిమా చూపిస్తా మామ’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘రాజ్ గారి గది-3’ వంటి తదితర చిత్రాల్లో నటించింది.

అయితే అందం, మంచి టాలెంట్ ఉన్న అవికాకి సినిమాలేవీ సరైన బ్రేక్ ఇవ్వలేదు. దాంతో బాలీవుడ్ కు మకాం మార్చిన ఈ బ్యూటీ అక్కడే పలు సినిమాలు వెబ్ సిరీస్ లు చేస్తుంది. తాజాగా అమ్మ‌డు వెస్టిండీస్ ఆట‌గాడు, కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ స్టార్ ఆల్‌రౌండ‌ర్ ఆండ్రీ రస్సెల్‌తో క‌లిసి స్టెప్పులేసి అల‌రించింది. ర‌స్సెల్ ఒక‌వైపు ఐపీఎల్‌లో ఆడుతూ మ‌రోవైపు ఆల్బ‌మ్స్ చేస్తున్నాడు. తాజాగా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన అత‌ను అవికాగోర్‌తో క‌లిసి ఓ ఆల్భ‌మ్ లో క‌నిపించి సంద‌డి చేశాడు. ‘లడ్కీ తు కమాల్ కీ’ అంటూ సాగే హిందీ ఆల్బమ్‌లో అవికా గోర్‌తో క‌లిసి ర‌స్సెల్ హుషారైన స్టెప్పులు వేయ‌గా, అవి క్రికెట్ అభిమానులనే కాక మూవీ ల‌వ‌ర్స్‌ని కూడా ఆక‌ట్టుట‌కుంటున్నాయి.

ఇక‌ ఈ పాటను రస్సెల్ స్వయంగా ఆలపించ‌డం విశేషం. ఇక వీడియోలో రంగు రంగుల కళ్లద్దాలు, నల్ల బనీన్, దానిపై గజిబిజి అక్షరాలతో ఫుల్ హ్యాండ్ షర్ట్, లుంగీని ధరించి వెరైటీ స్టైల్‌లో డ్యాన్స్ చేశారు ర‌స‌స్ఎల్‌. ఇక నీలి రంగు చీర‌లో అవికా త‌న అంద‌చందాలు ప్ర‌ద‌ర్శిస్తూ చిచ్చు రేపింది. ఈ ఇద్ద‌రి కాంబ‌లో వ‌చ్చిన ఆల్బ‌మ్ ప్ర‌తి ఒక్క‌రిని ఆక‌ట్టుకుంటుంది. ర‌స్సెల్‌లో ఇంత టాలెంట్ ఉందా అని కొంద‌రు ఆశ్చ‌ర్యం కూడా వ్య‌క్తం చేస్తున్నారు.

Exit mobile version