Suma|టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమ కనకాల గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఎంత మంది వచ్చిన కూడా సుమని ఢీకొట్టే యాంకర్ ఇప్పటి వరకు రాలేదు. ఒకవైపు పలు టీవీ షోలకి హోస్ట్‌గా పని చేస్తూనే మరోవైపు మూవీ ఈవెంట్స్ కూడా చేస్తూ బిజీబిజీగా ఉంటుంది సుమ.అయితే ప్రస్తుతం ఈ సీనియర్ యాంకర్ చేస్తున్న సుమ అడ్డా షో ప్రతి ఒక్కరిని ఎంతగానో అలరిస్తుంది. ఇప్పటి వరకు సుమ అడ్డా షో ప్రతి శనివారం ప్రసారం అయ్యేది. కానీ ఇప్పుడు టైమింగ్స్ మారడంతో మంగళవారం నుండి ప్రసారం కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రోమో రిలీజ్ చేశారు.
మంగళవారం ప్రసారం అయ్యే షోకి లవ్ మీ చిత్ర యూనిట్ ఆశిష్ రెడ్డి, బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య హాజరయ్యారు. అయితే మంగళవారం ఆంజనేయ స్వామి సెంటిమెంట్‌తో సుమ ఆంజనేయుడికి పూజలు చేస్తుంది. అప్పుడు ఆంజనేయ స్వామి సుమతో.. ఏంటమ్మా నువ్వు వెంకటేశ్వర స్వామి దగ్గర కదా ఉండాలసింది అని అడుగుతారు. ఇక నుంచి మీ దయతో మంగళవారం ఎంటర్టైన్మెంట్ అందిద్దాం అనుకుంటున్నా స్వామి.. మీ ఆశీస్సులు కావాలి అని అడుగుతుంది. తధాస్తు అని ఆంజనేయ స్వామి అంటారు. అక్కడితో ఆగని సుమ ప్రీ రిలీజ్ ఈవెంట్స్, సక్సెస్ సెలెబ్రేషన్ ఈవెంట్స్ కూడా అన్ని నాకే వచ్చేలా చూడు అని అడుగుతుంది.
అప్పుడే ఆంజనేయ స్వామి.. నా చేతిలో ఏముంది అని అడుగుతారు.. గద అని చెబితే.. అది ఇచ్చుకు కొడతా అని వార్నింగ్ ఇస్తారు. అయితే ఇది విన్న చాలా మంది సంపాదించింది సరిపోదా, ఇంకా ఎందుకు అంత కక్కుర్తి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక షోలో లవ్ మీ చిత్ర యూనిట్ సుమతో కలిసి తెగ సందడి చేశారు. దెయ్యాన్ని ప్రేమించడం మంచిదా, మనిషిని ప్రేమించడం మంచిదా అని సుమ ఆశిష్ రెడ్డిని అడుగుతుంది. అప్పుడు ఆశిష్ రెడ్డి దెయ్యమే బెటర్ అని అంటే.. అందుకేనా మా వారు నన్ను ప్రేమించారు అంటూ సుమ నవ్వులు పూయించింది. దెయ్యాలు ఎందుకు రాత్రిళ్ళు మాత్రమే తిరుగుతాయి అని సుమ అడగగా, దీనికి వైష్ణవి..సుమపై సెటైర్ వేసింది. దెయ్యాలు పగలు ఇలా షోలకు యాంకరింగ్ చేస్తూ బిజీగా ఉంటాయి అనడంతో సుమ కూడా షాక్ అయింది.