Site icon vidhaatha

Bala Krishna| మ‌రోసారి రేవంత్ రెడ్డిని క‌లిసిన బాల‌కృష్ణ‌..కార‌ణ‌మేంటో తెలుసా?

Bala Krishna| తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డిని ఈ మ‌ధ్య కాలంలో సినీ ప్ర‌ముఖులు మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లుస్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. చిరంజీవి, నాగార్జున దంప‌తులు కొన్ని నెల‌ల క్రితం రేవంత్ రెడ్డిని క‌లిసారు. కొత్త ముఖ్య‌మంత్రి ప‌ద‌వీ బాధ్య‌త‌లు అందుకున్న త‌ర్వాత రేవంత్‌ని క‌లిసి విషెస్ అందించారు. నందమూరి నటసింహం బాలకృష్ణ కూడా రేవంత్ రెడ్డిని కలిశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని క్యాంప్‌ ఆఫీసులో కలిసి బాలయ్య ప్రత్యేక అభినందలు తెలిపారు. బాలకృష్ణతోపాటు ఆయన అల్లుడు, తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, ఇతర అధికారులు, నాయకులు కూడా ఆ స‌మ‌యంలో ఉన్నారు.

ఒక‌ప్పుడు రేవంత్ రెడ్డి టీడీపీలో ఉండ‌డంతో బాల‌య్యకి ఆయ‌న‌కి మంచి సంబంధాలు ఉన్నాయి. ఇక తాజాగా మ‌రోసారి రేవంత్ రెడ్డిని క‌లిసారు బాల‌య్య‌. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని రేవంత్ రెడ్డి ఇంటికి చేరుకున్న బాలకృష్ణ సీఎంకు పుష్పగుచ్ఛం అందించి , ప‌లు విష‌యాల‌పై చ‌ర్చించిన‌ట్టు తెలుస్తుంది..ఈ సారి బాలకృష్ణతో పాటు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ట్రస్ట్ సభ్యులు, తదితరులు ఉన్నారు. మర్యాదపూర్వకంగానే బాలకృష్ణ రేవంత్ రెడ్డిని కలిశారని ముఖ్యమంత్రి కార్యాలయవర్గాలు వెల్లడించాయి. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Exit mobile version