Site icon vidhaatha

నమస్కారం బాబు అంటే కాండ్రించి ముఖంపై ఉమ్మేశాడు

విధాత‌: నటుడు కోట శ్రీనివాస రావు సోషల్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు జరిగిన అవమానాన్ని బయటపెట్టాడు. తాను నటించిన మండలాధీశుడు సినిమా చాలా బాగా చేశావంటూ దివంగత నటుడు ఎన్టీఆర్‌ మెచ్చుకుంటే, ఆయన తనయుడు బాలకృష్ణ మాత్రం తన ముఖం మీద ఉమ్మేశాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఇప్పుడు బాలకృష్ణ.. కోటగారు చాలా మంచి నటుడు అని అంటుంటారు.
కానీ గతంలో రాజమండ్రిలో ఓ సినిమా షూటింగ్‌లో ఉన్నప్పుడు ఓరోజు బాలకృష్ణ కనిపించారు. గౌరవంగా నేనే నమస్కారం బాబు అని అన్నాను. కాండ్రించి ముఖంపై ఉమ్మేశాడు. ఇది ఆయన సంస్కారం మరి. ఏం చేస్తాం? ఇలాంటి చేదు ఘటనలు మర్చిపోలేను’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కోట శ్రీనివాస రావు చేసిన ఈ కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

Exit mobile version