విధాత : దర్శకుడు ప్రశాంత్‌వర్మ సినిమాటిక్ యూనివర్స్ (పీవీసీయూ) నుంచి వస్తున్నభద్రకాళి సినిమా నుంచి కీలక్ ఆప్డేట్ వెలువడింది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా శుక్రాచార్యుడిగా నటించనున్నట్లు ప్రశాంత్ వర్మ వెల్లడించారు. ‘‘దేవతల నీడలో కాంతివంతమైన తిరుగుబాటు జ్వాలగా ఎదిగిన శుక్రాచార్యుడు..’ అంటూ ఓ పోస్టర్‌ను పంచుకున్నారు. గతంలో ఈ ‘మహాకాళి’ గురించి ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. ‘‘మా యూనివర్స్‌కు కొత్త శక్తి జోడైంది. అత్యంత భయంకరమైన చెడుపై యుద్ధం చేయడానికి కాళికాదేవి స్వరూపం రానుంది. సూపర్ హీరోలు ఎలా ఉంటారో ఈ చిత్రంలో చూపించనున్నాం’’ అని ప్రకటించారు.
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి స్వీయా దర్శకత్వంలో వచ్చిన తొలి సినిమా ‘హనుమాన్’. గతేడాది సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా పాన్‌ఇండియా స్థాయిలో విజయం సాధించింది. ఈ క్రమంలో ప్రశాంత్ తన సినిమాటిక్ యూనివర్స్ నుంచి వరుసగా పలు సినిమాలు చేయబోతున్నట్లుగా ప్రకటించారు. ఈ క్రమంలో మూడో సినిమా ‘మహాకాళి’ని ప్రకటించారు . ఫీమేల్ సూపర్ హీరో చిత్రంగా ముస్తాబు కానుంది. దీనికి ప్రశాంత్ వర్మ కథ అందిస్తుండగా.. పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఇదే కాకుండా తన యూనివర్స్‌లో భాగంగా ఇటీవల ‘అధీర’ను ప్రకటించారు. ఎస్‌జే సూర్య, కల్యాణ్ దాసరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నట్లు తెలిపారు. ఈ సూపర్ హీరో ఫిల్మ్‌కు శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించనున్నారు.