Bigg Boss8| అనుకున్న స‌మ‌యానికి ముందే బిగ్ బాస్ లాంచింగ్.. ఎప్పుడు వస్తుంది అంటే..!

Bigg Boss8| బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్ర‌మం తెలుగులో దూసుకుపోతుంది. బిగ్ బాస్ సీజ‌న్ 7 గ్రాండ్ స‌క్సెస్ కావ‌డంతో ఇప్పుడు సీజ‌న్ 8ని వీలైనంత తొంద‌ర‌గా తీసుకురావాల‌ని నిర్వాహ‌కులు ప్లాన్ చేస్తున్నారు. గ‌త కొద్ది రోజులుగా ఈ షోకి సంబంధించి నెట్టింట అనేక ప్ర‌చారాలు సాగుతు

  • Publish Date - July 1, 2024 / 07:45 AM IST

Bigg Boss8| బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్ర‌మం తెలుగులో దూసుకుపోతుంది. బిగ్ బాస్ సీజ‌న్ 7 గ్రాండ్ స‌క్సెస్ కావ‌డంతో ఇప్పుడు సీజ‌న్ 8ని వీలైనంత తొంద‌ర‌గా తీసుకురావాల‌ని నిర్వాహ‌కులు ప్లాన్ చేస్తున్నారు. గ‌త కొద్ది రోజులుగా ఈ షోకి సంబంధించి నెట్టింట అనేక ప్ర‌చారాలు సాగుతున్నా కూడా ఇప్పటి వ‌ర‌కు అయితే క్లారిటీ ఇవ్వ‌లేదు. తాజా స‌మాచారం మేర‌కు సీజన్ 8ని ఆగస్టు మొదటి వారమే లాంచ్ చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. ఆగస్టు 4 లేదా 11 తారీకుల్లో షో మొదలు కానుంద‌ని, ఈ నెల నుండి ప్రోమోలు ఒక్కొక్క‌టిగా విడుద‌ల చేయ‌నున్నారని అంటున్నారు.

బిగ్ బాస్ సీజ‌న్ 8కి కూడా నాగార్జున‌నే హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నార‌ని, ఆయ‌న ఇప్పుడు షూటింగ్‌కి కూడా సిద్ధం అవుతున్నార‌ని టాక్ వినిపిస్తుంది. ఆగ‌స్ట్ నుండి మూడు నెల‌ల పాటు బిగ్ బాస్ షో ప్రేక్ష‌కుల‌కి కావ‌ల్సినంత ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఇస్తుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ షోలో ఎప్పటిలానే బుల్లితెర, వెండితెర సెలెబ్స్ తో పాటు సోషల్ మీడియా స్టార్స్ కంటెస్టెంట్స్‌గా పాల్గొన‌బోతున్న‌ట్టు తెలుస్తుంది. ఈ సారి బర్రెలక్క పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. తెలంగాణ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి పాపులారిటీ తెచ్చుకున్న బ‌ర్రెలక్క‌ని బిగ్ బాస్ హౌజ్‌లోకి పంప‌డం గ్యారెంటీ అని ఆదిరెడ్డి ఇటీవ‌ల చెప్పుకొచ్చారు.

డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న హేమ, సోషల్ మీడియాలో ర‌చ్చ చేస్తున్న సురేఖా వాణి లేదంటే ఆమె కూతురు, పరువు హత్యకు గురైన ప్రణయ్ భార్య అమృత , హీరో రాజ్ తరుణ్ , జబర్దస్త్ మాజీ కమెడియన్ రీతూ చౌదరి , కిరాక్ ఆర్పీ, కుమారీ ఆంటీ ఇలా ప‌లువురి పేర్లు అయితే ప్ర‌ముఖంగా వినిపిస్తున్నాయి. కొద్ది రోజులుగా కంటెస్టెంట్స్‌కి సంబంధించిన ప్ర‌క్రియ జ‌రుగుతుందని త్వ‌ర‌లోనే ఎవరెవ‌రు పాల్గొన‌బోతున్నారు అనే దానిపై క్లారిటీ వ‌స్తుంద‌ని అంటున్నారు.

Latest News