Site icon vidhaatha

Bigg Boss8|బిగ్ బాస్ తెలుగు 8 కాన్సెప్ట్ ఆ షోకి కాపీనా? ఈ సారి హౌజ్ ఎలా ఉంటుంది అంటే..!

Bigg Boss8| బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి ప‌రిచయం అక్క‌ర్లేని పేరు బిగ్ బాస్. ఈ కార్య‌క్ర‌మం స‌క్సెస్ ఫుల్‌గా సాగుతుంది. తెలుగులో ఈ షోకి విప‌రీత‌మైన ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. ఇప్ప‌టికే ఏడు సీజ‌న్స్ పూర్తి కాగా, మ‌రి కొద్ది రోజుల‌లో సీజ‌న్ 8 మొద‌లు కానుంది. సెప్టెంబర్ 1న సాయంత్రం 7 గంటలకు బిగ్‏బాస్ రియాల్టీ షో స్టార్ట్ కానుందని ఇదివరకే నిర్వాహకులు ప్రకటించారు. దీంతో సోషల్ మీడియాలో బిగ్‏బాస్ కంటెస్టెంట్స్ గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. సీరియల్ యాక్టర్స్, హీరోహీరోయిన్స్, యాంకర్స్, సోషల్ మీడియా స్టార్స్, మోడల్స్ ఇలా చాలా మంది ఈసారి బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్ట‌నున్న‌ట్టు స‌మాచారం.

బిగ్ బాస్ ప్ర‌తి సీజ‌న్‌కి అంచ‌నాలు ఓ రేంజ్‌లో ఉంటాయి. ఇప్పుడు 8వ సీజన్‌పై కూడా ఎక్స్‌పెక్టేషన్స్ భారీగానే ఉన్నాయి. అయితే హోస్ట్‌గా ఈ షోకి నాగార్జున‌నే వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. ఈ సారి బిగ్ బాస్ హౌజ్‌లోకి ఏకంగా 17 మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్ట‌నున్నార‌ని స‌మాచారం. ఇక హౌజ్‌లోకి వ‌చ్చే వారిలో ఆదిత్య ఓం, యష్మీ గౌడ, అభిరామ్ వర్మ, బెజవాడ బేబక్క, నిఖిల్ మలియక్కల్, నైనిక అనసురు, పెళ్లి చూపులు ఫేమ్ అభయ్ నవీన్, విష్ణుప్రియ, విస్మయ శ్రీ, కిర్రాక్ సీత ఈ పది మొదటిరోజే హౌజ్‌లోకి వెళ్లనున్నారు. ఆ తర్వాత వైల్డ్ కార్డ్ తర్వాత మొదటి రెండు వారాల్లో ఇంద్రనీల్ వర్మ, రీతూ చౌదరి వంటి వారి పేర్లు ఎక్కువ‌గా వినిపిస్తున్నాయి. వీరితో పాటు ఆర్జే శేఖర్ బాషా, నాగ మణికంఠ, సహర్ కృష్ణన్, ఖయ్యూమ్ అలీ కూడా కంటెస్టెంట్స్‌గా ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ట్టు ఓ టాక్ న‌డుస్తుంది.

ఇక ఇదిలా ఉంటే బిగ్ బాస్ సీజ‌న్ 8 హిందీ 8వ సీజన్ కాన్సెప్ట్‌నే వాడుకొని రూపొందిస్తున్న‌ట్టు తెలుస్తుంది. హిందీ బిగ్ బాస్ 8లో గత సీజన్‌లోని కంటెస్టెంట్స్‌ను తీసుకొచ్చి పార్టిస్‌పేట్ చేయించారట. పాత సీజన్‌లో నెగెటివ్‌గా గానీ, పాజిటివ్‌గా కానీ భారీ రెస్పాన్స్ తెచ్చుకున్న మాజీ హౌజ్‌మేట్స్‌ను సీజన్ 8లోకి తీసుకొచ్చి ఆడించారట. చివరిలో తీసుకొచ్చి, పెద్ద ట్విస్ట్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేయగా, ఇప్పుడు దీనిని సీజ‌న్ 8లో ఇంప్లిమెంట్ చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. బిగ్ బాస్ 8 తెలుగులోకి వచ్చే మాజీ కంటెస్టెంట్స్‌పై ఇంకా క్లారిటీ రాలేదు. ఇక బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ హౌజ్ దాదాపుగా సీజన్ 7 తరహాలో ఉంటుందని టాక్

Exit mobile version