Site icon vidhaatha

Bigg Boss8|ఒక్కొక్క‌రికి ఇచ్చి ప‌డేసిన నాగార్జున‌.. కన్న‌డ బ్యాచ్‌కి నోట మాట కూడా రాలేదుగా..!

Bigg Boss8|బిగ్ బాస్ తెలుగు సీజ‌న్ 8లో క‌న్న‌డ బ్యాచ్ హంగామా ఎక్కువ‌గా క‌నిపిస్తుంది.యాటిట్యూడ్ చూపిస్తూ విమ‌ర్శ‌లు అందుకుంటున్నారు. అయితే తాజా ఎపిసోడ్‌లో నాగార్జున‌.. నిఖిల్‌తో పాటు య‌ష్మికి కూడా లెఫ్ట్ అండ్ రైట్ క్లాస్ పీకాడు. నిఖిల్‌ని బూతులు తిట్టి తాను ఏమి అన‌లేద‌ని క‌వ‌ర్ చేసుకున్న గౌత‌మ్ కి కూడా గ‌ట్టిగానే క్లాస్ ప‌డింది. తానుఅనాలనుకున్న మాటను సైలెంట్ గా బయటకు వినిపించకుండా అనడంతో అది కాస్త ఇష్యూ అయ్యింది. బిగ్ బాస్ హౌస్ లో అది పెద్ద చర్చకు దారి తీసింది. ఇక ఈ విషయంలో నాగార్జున గ‌ట్టిగానే మంద‌లించాడు. ఇక నాగార్జున మాట‌ల‌కి య‌ష్మీ స‌మాధానం చెప్ప‌లేక త‌ల‌దించుకుంది. మంచిగా ఆడిన వారికి నాగార్జున ప్ర‌శంస‌లు అందించాడు.

విష్ణు ప్రియ విషయంలో ఎప్పటిలాగానే స్పందించని నాగ్.. ఆమెను చిన్నపిల్లల మ‌న‌స్త‌త్వంగా భావించి ఏమీ అనకుండా వదిలేస్తున్నట్టు అనిపిస్తోంది. విష్ణు ప్రియ విష‌యంలో న‌బీల్‌కి క్లాస్ ప‌డిన కూడా అత‌ను ఇంకా ఆమెపైన సీరియ‌స్‌గానే ఉన్న‌ట్టు క‌నిపించింది. ఇక అవినాశ్, రోహిణీ, హరితేజల ఆటతీరు, హౌస్ లో ఉంటున్న విధానం చాలా బాగుంద‌ని నాగార్జున అన్నాడు. మొత్తానికి ఈ వారం నోరు జారి కాస్త బూతులుమాట్లాడిన కంటెస్టెంట్స్ కు గట్టిగానే ఇచ్చాడు నాగ్. కన్నడ బ్యాచ్ గా .. గ్రూప్ కట్టి.. హౌస్ లో విలనిజం చూపిస్తున్న బ్యాచ్ నాగార్జున దెబ్బ‌కి ఉలిక్కి ప‌డింది.

ఇక ఈ వారం ఎవ‌రు ఎలిమినేట్ అయ‌యేది ఎవ‌రు అనే దానిపై స‌స్పెన్స్ నెల‌కొంది. శనివారం ఎపిసోడ్ లో టేస్టీ తేజ్ ను సేవ్ చేసిన నాగార్జున. మిగతా వారిలో ఎవరు సేఫ్.. ఎవరు ఎలిమినేటెడ్ అనేది ఆదివారం ఎపిసోడ్ లో రివిల్ చేస్తాన‌ని చెప్పుకొచ్చారు.ప్ర‌స్తుత రిపోర్ట్స్ చూస్తే న‌య‌ని పావ‌ని హౌజ్ నుండి ఎలిమినేట్ కానుంద‌ని అంటున్నారు. మ‌రోవైపు ఎప్పుడో ఎలిమినేట్ కావాల్సిన హరితేజను బిగ్ బాస్ కాపాడుతూ వచ్చాడు.. అయితే ఈసారి ఆమె ఓటింగ్ లో డౌన్ ఉండడంతో ఆమెను ఎలిమినేట్ చేసి ఇంటికి పంపకుండా ఆమెను సీక్రెట్ రూమ్ లో దాస్తారంటూ కొంద‌రు జోస్యాలు చెబుతున్నారు.చూడాలి ఏం జ‌రుగుతుందో..!

Exit mobile version