Site icon vidhaatha

Bigg Boss8|ఈ వారం వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ ఎలిమినేట్ కానున్నారా.. డేంజర్ జోన్‌లో ఆ ఇద్ద‌రు..!

Bigg Boss8| బిగ్ బాస్(Bigg Boss) కార్య‌క్ర‌మం రోజు రోజుకి ర‌స‌వత్త‌రంగా మారుతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు సీజన్ 8 (Season8)స‌క్సెస్ ఫుల్‌గా ఆరువారాలు పూర్తి చేసుకోగా, ఏడుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. తొలివారం బెజవాడ బేబక్క, ఆ త‌ర్వాత శేఖర్ బాషా, అభయ్ నవీన్, సోనియా ఆకుల, నైనిక, ఆదిత్యం ఓం ఇలా ఒక్కొక్క‌రు హౌజ్‌ని వీడారు. గ‌త వారం కిరాక్ సీత బిగ్ బాస్ హౌజ్‌ని వీడ‌డం మ‌నం చూశాం. ఇక ఈ వారం ఎవ‌రు ఎలిమినేట్ అవుతారా అని అంద‌రు ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నారు. అయితే ఈ వారం నామినేష‌న్‌లో నబీల్, నాగ మణికంఠ, ప్రేరణ, పృథ్వి, టేస్టీ తేజ, హరితేజ, గౌతమ్, నిఖిల్, యష్మి ఉన్నారు.

శుక్రవారం అర్ధరాత్రి వరకు మాత్ర‌మే ఓటింగ్ లైన్స్ ఉంటాయి. దీనికి ఎంతో స‌మ‌యం లేదు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఓటింగ్(Voting) జ‌రిగిన స‌ర‌ళిని ప‌రిశీలిస్తే.. సోషల్ మీడియా స్టార్ నబీల్ అనూహ్యంగా టాప్ లో ట్రెండ్ అవుతున్న‌ట్టు తెలుస్తుంది. 21 శాతానికి ఐగా అత‌నికి ఓట్స్ పోల్ అయ్యాయ‌ట‌. సీరియల్ నటుడైన నిఖిల్ మొదటి నుండి గేమ్ పరంగా ముందంజలో ఉండ‌గా, ఇప్పటికి అత‌నికి మంచిగానే ఓట్లు పోల్ అవుతున్నాయ‌ట‌. ఇక మూడో స్థానంలో నాగ మణికంఠ, ఆ తర్వాత స్థానంలో ప్రేరణ , పృథ్విరాజ్ ఐదో స్థానంలో ఉండటం విశేషం. ఇటీవ‌ల అవినాష్ భార్య‌పై పృథ్వీరాజ్చే(Prithvi Raj)సిన కామెంట్స్‌తో ఆయ‌నపై కాస్త నెగెటివిటీ ఏర్ప‌డింది. ఆయ‌న త‌ర్వాత హ‌రితేజ ఉంద‌ట‌.

అయితే ఇప్ప‌టివ‌ర‌కు ఉన్న ఓటింగ్ ప్ర‌కారం టేస్టీ తేజ, గౌతమ్(Goutham) చివరి రెండు స్థానాల్లో నిలిచారట. ఈ ఇద్ద‌రు వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌజ్‌లోకి వ‌చ్చారు. గ‌త సీజ‌న్‌లో ఈ ఇద్ద‌రు బెస్ట్ ప‌ర్‌ఫార్మెన్స్ ఇచ్చారు. తేజ త‌న కామెడీతో ఆక‌ట్టుకుంటుండ‌గా, గౌత‌మ్ పులిహోర క‌లుపుతూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాడు. గత సీజన్లో శుభశ్రీ రాయగురు తో పులిహోర కలిపాడు. ఆమె మాత్రం ఒక లైన్ మైంటైన్ చేసింది. గౌతమ్ కి దగ్గర కాలేదు. ప్రస్తుత సీజన్లో యష్మితో గౌతమ్ సన్నిహితంగా ఉంటున్నాడు. ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవేళ గౌతమ్ ఎలిమినేట్(Eliminate) అయితే.. ఈ లవ్ ట్రాక్ కి బ్రేక్ పడ్డట్లే. ఈ వారం తేజ‌, గౌత‌మ్ ల‌లో ఒక‌రు ఎలిమినేట్ కావ‌డం ప‌క్కా అంటున్నారు. చూడాలి మ‌రి.

Exit mobile version