Site icon vidhaatha

బాలీవుడ్ నటుడు దిలీప్‌కుమార్‌ కన్నుమూత

విధాత:ప్రముఖ బాలీవుడ్ నటుడు దిలీప్‌ కుమార్‌(98) కన్నుమూశారు.కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ఆయన ముంబయిలోని హిందూజా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. గతనెల ఆరో తేదీన శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తడంతో దిలీప్‌ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే.1922 డిసెంబరు 11న పాక్‌లోని పెషావర్‌లో దిలీప్‌కుమార్‌ జన్మించారు. సినిమాల్లోకి రాకముందు తండ్రితో కలిసి దిలీప్‌ పండ్లు విక్రయించారు. ఉత్తమ నటుడిగా దిలీప్‌కుమార్‌ 8సార్లు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు అందుకున్నారు.

Exit mobile version