Kalki| బుజ్జిని ప‌రిచ‌యం చేయ‌డానికి స్పెష‌ల్ ఈవెంట్ ప్లాన్ చేసిన క‌ల్కి టీం… అన్ని కోట్లు ఖ‌ర్చు పెట్టారా..!

Kalki|  యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌ధాన పాత్ర‌లో మ‌హాన‌టి ఫేం నాగ్ అశ్విన్ తెర‌కెక్కిస్తున్న చిత్రం కల్కి 2898 AD . ప‌లు వాయిదాల త‌ర్వాత ఈ చిత్రం జూన్ 27న గ్రాండ్

  • Publish Date - May 23, 2024 / 07:01 AM IST

Kalki|  యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌ధాన పాత్ర‌లో మ‌హాన‌టి ఫేం నాగ్ అశ్విన్ తెర‌కెక్కిస్తున్న చిత్రం కల్కి 2898 AD . ప‌లు వాయిదాల త‌ర్వాత ఈ చిత్రం జూన్ 27న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది.అయితే రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో చిత్ర యూనిట్ ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు వేగ‌వంతం చేసింది.దాదాపు 600 కోట్ల రూపాయ‌ల‌తో మూవీని రూపొందించిన‌ట్టు తెలుస్తుండ‌గా, ఆ రేంజ్‌లోనే ప్ర‌చార కార్య‌క్ర‌మాలు ఉంటున్నాయి. ఈ చిత్రంలో ప్రభాస్ ఉపయోగించే కారు బుజ్జి అని చెప్పిన మేక‌ర్స్ ఆ బుజ్జిని త‌యారు చేయ‌డానికి ఎంత క‌ష్ట‌ప‌డ్డారో వీడియో ద్వారా చూపించారు. అయితే ఆ వీడియో చూసిన‌ప్ప‌టి నుండిగ బుజ్జిని చూడాలని, ఆ వాహ‌నాన్ని ప్ర‌భాస్ ఎలా డ్రైవ్ చేస్తాడో చూడాల‌ని అనుకున్నారు.

బుధవారం రామోజీ ఫిలిం సిటీలో దాదాపు నాలుగు కోట్ల ఖర్చుతో బుజ్జిని పరిచయం చేసే ఓ ఈవెంట్ ని ప్లాన్ చేశాడు. ఇందులో మ‌నం ఎప్పుడు చూడ‌ని విధంగా పెద్ద స్టేజ్ ఏర్పాటు చేశారు. ఇక ప్ర‌భాస్ అయితే బుజ్జిని డ్రైవ్ చేసుకుంటూ డైరెక్ట్‌గా వేదిక‌పైకి వ‌చ్చాడు. బుజ్జితో స్టేజ్‌పై రౌండ్స్ కొట్టి ఒక సూపర్ హీరోలా క‌నిపించాడు.ప్ర‌భాస్‌ని ఇలా చూసి ఫ్యాన్స్ ఆనందం అంతా ఇంతా కాదు. బుజ్జి నుండి బ‌య‌ట‌కు వ‌చ్చిన ప్ర‌భాస్ త‌న ఎక్స్‌పీరియ‌న్స్ తెలియ‌జేశాడు. డైరెక్టర్ నాగ్ అశ్విన్ మూడేళ్ళ పాటు బుజ్జితో నరకం చూపించాడని సరదాగా కామెంట్స్ చేశాడు. అనంతరం బుజ్జి గ్లింప్స్ ని ఈవెంట్ లో ప్ర‌ద‌ర్శించ‌గా, దానికి భారీ రెస్పాన్స్ వ‌చ్చింది.

ఇందులో యాక్ష‌న్ సీన్స్ చూస్తుంటే హాలీవుడ్ రేంజ్‌ని మించి ఉన్నాయి. గ్లింప్స్‌లో బుజ్జి ప్రభాస్ కి పరిస్థితులు అనుకూలంగా లేవు వెనక్కి వెళ్ళిపోదాం పద అని హెచ్చరిస్తుంది. ఇంక తిరిగి వెళ్ళేదే లేదు అంటూ ప్రభాస్ చెప్పడం ఫ్యాన్స్‌కి పిచ్చెక్కిపోయేలా చేసింది. మొత్తానికి ఈ ఈవెంట్‌తో సినిమాపై అంచ‌నాలు మ‌రింత పెరిగాయి. కాక‌పోతే ప్ర‌చారం కోసం ఇన్ని కోట్లు ఖ‌ర్చు పెడుతుండ‌డం అంద‌రికి ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తుంది. ఓవరాల్ గా కల్కి చిత్ర యూనిట్ మొత్తం ప్రమోషన్స్ కోసం ఏకంగా 50 కోట్ల బడ్జెట్ ని కల్కి నిర్మాతలు కేటాయించిన‌ట్టు స‌మాచారం. ఇటీవ‌ల ఐపీఎల్‌లో 12 సెకండ్ల యాడ్ కోసం స్టార్ స్పోర్ట్స్ కి ఏకంగా 3 కోట్లు వెచ్చించారు. ఆ యాడ్ ద్వారా చిత్ర యూనిట్ 10 కోట్ల వరకు వ్యూస్ పొందినట్లు తెలుస్తోంది.

Latest News