Site icon vidhaatha

‘క్యాలీఫ్లవర్’ నవ్విస్తుంది.

విధాత:సంపూర్ణేష్‌బాబు హీరోగా నటిస్తున్న చిత్రం ‘క్యాలీఫ్లవర్‌’. ‘శీలో రక్షతి రక్షిత’ ఉపశీర్షిక. ఆర్కే మలినేని దర్శకుడు. ఆశాజ్యోతి గోగినేని నిర్మాత. వాసంతి హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల హైదరాబాద్‌లో ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. దర్శకుడు మాట్లాడుతూ ‘వినోదభరిత కథాంశంతో రూపొందిస్తున్నాం.

ఇందులో ఇంగ్లాండ్‌ నుంచి ఇండియాకు వచ్చే వ్యక్తిగా సంపూర్ణేష్‌బాబు కనిపిస్తారు. ఆయన శైలి హాస్యంతో కడుపుబ్బా నవ్విస్తుంది. ఇటీవల విడుదలచేసిన ఫస్ట్‌లుక్‌తో పాటు టైటిల్‌కు చక్కటి స్పందన లభిస్తోంది’ అని తెలిపారు. ప్రధాన పాత్రల్లో పోసాని కృష్ణమురళి, పృథ్వీ, నాగినీడు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రజ్వల్‌ క్రిష్‌.

Exit mobile version