విధాత: టాలీవుడ్ లో ఇప్పుడున్న క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో హీరోయిన్లతో సమానంగా ఫేమ్ సంపాదించుకున్న నటి ప్రగతి. గత కొన్నాళ్లుగా టాలీవుడ్ లో యంగ్ మదర్ రోల్స్ కు ప్రాముఖ్యత పెరగడంతో ప్రగతి దర్శకుల చాయిస్ గా మారింది. ఇక సోషల్ మీడియాలో ప్రగతి ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు. ఆమె పోస్టు చేసే వీడియోలకు మంచి స్పందన ఉంటుంది. తాజాగా సెట్స్ పై ఆమె సహనటులతో చేసిన వీర మాస్ డ్యాన్స్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. చీరకట్టులో ప్రగతి వేసిన స్టెప్పులకు సెట్స్ పై ఈలలు మోగాయి.