Chiranjeevi| ఓటు హ‌క్కు వినియోగించుకున్న తేజ‌.. ప్ర‌తి ఒక్క‌రు ఓటు వేయాలంటూ పిలుపు

Chiranjeevi| తెలంగాణ వ్యాప్తంగా 17 పార్ల‌మెంట్ నియోజ‌క వ‌ర్గాల‌లో పోలింగ్ ప్ర‌శాంతంగా జ‌రుగుతుంది. ఈ సారి ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున పోలింగ్ బూతుల‌కి త‌ర‌లి వ‌స్తున్నారు. సినీ ప్ర‌ముఖులు, రాజ‌కీయ నాయ‌కులు, వ్యాపార వేత్తలు కూడా క్యూ లైన్‌లో నిలుచొని త‌మ ఓటు వినియోగించుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి త‌న భార్య సురేఖ‌తో క‌లిసి జూబ్లిహిల్స్‌లోని పోలింగ్ బూత్‌కి వెళ్లి ఓటు వేసారు. ఓటు వేసిన త‌ర్వాత ఆయ‌న మీ

  • Publish Date - May 13, 2024 / 09:02 AM IST

Chiranjeevi| తెలంగాణ వ్యాప్తంగా 17 పార్ల‌మెంట్ నియోజ‌క వ‌ర్గాల‌లో పోలింగ్ ప్ర‌శాంతంగా జ‌రుగుతుంది. ఈ సారి ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున పోలింగ్ బూతుల‌కి త‌ర‌లి వ‌స్తున్నారు. సినీ ప్ర‌ముఖులు, రాజ‌కీయ నాయ‌కులు, వ్యాపార వేత్తలు కూడా క్యూ లైన్‌లో నిలుచొని త‌మ ఓటు వినియోగించుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి త‌న భార్య సురేఖ‌తో క‌లిసి జూబ్లిహిల్స్‌లోని పోలింగ్ బూత్‌కి వెళ్లి ఓటు వేసారు. ఓటు వేసిన త‌ర్వాత ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ప్ర‌తి ఒక్క‌రు ఓటు హ‌క్కు వినియోగించుకోవాల‌ని కోరారు. ఓటు మ‌న హ‌క్కు కాదు, బాధ్య‌త అని గుర్తు చేశారు. ప్ర‌తి ఒక్క‌రు కూడా విధిగా ఓటు హ‌క్కుని విన‌యోగించుకోవాలంటూ చిరు విజ్ఞ‌ప్తి చేశారు.

ద‌ర్శ‌కుడు తేజ‌, జూనియ‌ర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి వారు కూడా ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. మీడియాతో మాట్లాడిన తేజ‌.. ఇంట్లో కూర్చోకుండా బ‌య‌ట‌కు వ‌చ్చి ఓటు హ‌క్కు వినియోగించుకోండి. మీ ప్రభుత్వం బాగోలేదని తర్వాత ఫిర్యాదు చేయకూడదంటే త‌ప్ప‌నిస‌రిగా ప్ర‌తి ఒక్కరు ఓటు హ‌క్కుని వినియోగించుకోవ‌ల‌ని కోరారు తేజ‌.

Latest News