Site icon vidhaatha

Chiranjeevi | మెగాస్టార్‌ చిరంజీవికి యూఏఈ గోల్డెన్‌ వీసా..!

Chiranjeevi | మెగా స్టార్‌ చిరంజీవికి మరో అరుదైన గౌరవం దక్కింది. యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గోల్డెన్ వీసాను అందుకున్నారు. ఇప్పటికే భారతీయ నటులను గోల్డెన్‌ వీసాతో సత్కరించగా.. తాజాగా చిరంజీవికి సైతం ఆ ఘనత దక్కింది. ఇటీవల పద్మవిభూషణ్‌ అవార్డును చిరంజీవి అందుకున్న విషయం తెలిసిందే.  వివిధ రంగాల్లో కృషి చేసిన వారికి యూఏఈ ప్రభుత్వం ఈ గోల్డెన్‌ వీసా అందిస్తున్న విషయం విధితమే.

ఇన్వెస్టర్లు, వ్యవస్థాపకులు, శాస్త్రవేత్తలు, నటులు, అసాధారణ ప్రతిభ కలిగిన గ్రాడ్యుయేట్లకు 10 ఏళ్ల కాలపరిమితితో ఈ వీసాను యూఏఈ ప్రభుత్వం అందిస్తుంది. గతంలో భారతీయ చిత్రపరిశ్రమకు చెందిన రజనీకాంత్‌, షారుఖ్ ఖాన్, అల్లు అర్జున్, దుల్కర్ సల్మాన్, త్రిష, అమలాపాల్, మోహన్‌లాల్, మమ్ముట్టి, టొవినో థామస్ తదితరులు గోల్డెన్ వీసా అందుకున్నవారిలో ఉన్నారు. ఈ సందర్భంగా చిరంజీవికి పలువురు టాలీవుడ్‌ సెలబ్రిటీలతో పాటు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Exit mobile version