johnny master| జానీ మాస్ట‌ర్ గురించి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి కంప్లైంట్‌.. ఏకంగా ఆయ‌న అరాచకాల‌కి సంబంధించి కొరియ‌ర్

johnny master| ఏపీ డిప్యూటీ సీఎంగా అధికారం చేజిక్కించుకున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న‌దైన శైలిలో దూసుకుపోతున్నారు. మొదటిసారిగా ఎమ్మెల్యే హోదాలో అసెంబ్లీలోకి అడుగుపెట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. తొలిరోజే అధికారులకి కంటిపై కునుకు లేకుండా చేశారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం పూర్తైన తర్వాత పవన్ క

  • Publish Date - June 22, 2024 / 06:44 AM IST

johnny master| ఏపీ డిప్యూటీ సీఎంగా అధికారం చేజిక్కించుకున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న‌దైన శైలిలో దూసుకుపోతున్నారు. మొదటిసారిగా ఎమ్మెల్యే హోదాలో అసెంబ్లీలోకి అడుగుపెట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. తొలిరోజే అధికారులకి కంటిపై కునుకు లేకుండా చేశారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం పూర్తైన తర్వాత పవన్ కళ్యాణ్ సీజనల్ వ్యాధుల మీద సమీక్ష నిర్వహించారు. నిధుల మ‌ళ్లింపు ఎందుకు జ‌రిగింది, ఆర్థిక సంఘం, స్థానిక సంస్థల నిధులను ఏ మేరకు ఇతరత్రా వాటికి మళ్లించారో నివేదించాలని అధికారులకు స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం. ప్ర‌స్తుతం ఆయ‌న రాజ‌కీయ కార్య‌కలాపాల‌తో చాలా బిజీగా ఉన్నారు. ఆయ‌న‌కి ఫిర్యాదులు కూడా అందుతున్నాయి.

ఏపీ ప్ర‌భుత్వ ప్ర‌జావాణి కార్య‌క్ర‌మంలో భాగంగా ప్ర‌జ‌లు త‌మ స‌మ‌స్య‌ల‌ని ప్రజావాణికి ఫిర్యాదు చేస్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. ఈ క్ర‌మంలోనే టాలీవుడ్ కొరియోగ్రాఫ‌ర్, జ‌న‌సేన నాయ‌కుడు జానీ మాస్ట‌ర్‌పై ఫిర్యాదు అందింది. సతీష్‌ అనే డాన్సర్‌ జానీ మాస్టర్‌ చేస్తున్న అరాచకాల గురించి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి కొరియ‌ర్ ద్వారా ఫిర్యాదు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. కొరియోగ్రాఫ‌ర్ జానీ మాస్ట‌ర్ త‌న‌ని వేధిస్తున్నార‌ని, రాయ‌దుర్గం పోలీస్ స్టేష‌న్‌లో ఈ నెల 5న స‌తీష్ ఫిర్యాదు చేశారు. త‌న‌ని షూటింగ్‌ల‌కి పిల‌వ‌కుండా వేధిస్తున్నార‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశాడు. జానీ మాస్ట‌ర్ త‌మ డ్యాన్స్ యూనియ‌న్ స‌భ్యుల‌కి స‌తీష్‌ని పిల‌వొద్దని చెప్పాడ‌ని ఆయ‌న అన్నాడు.

అయితే గ‌త నాలుగు నెల‌లుగా త‌న‌కి ఉపాధి లేకుండా పోయింద‌ని, ఇప్పుడు దాని వ‌ల‌న చాలా ఇబ్బందులు ప‌డుతున్నాన‌ని పేర్కొన్నారు స‌తీష్‌. జ‌న‌ర‌ల్ బాడీ మీటింగ్‌లో సమస్య‌ల గురించి మాట్లాడినందుకే జానీ మాస్ట‌ర్ ఇలా నాపై క‌క్ష్య సాధింపు చ‌ర్య‌లు చేప‌ట్టాడ‌ని పేర్కొన్నాడు. మ‌రి దీనిపై ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏమైన స్పందిస్తాడా లేదా అనేది చూడాలి. కాగా, జానీ మాస్ట‌ర్ ఇప్పుడు తెలుగు ఫిల్మ్ అండ్‌ టీవీ డాన్సర్స్ అండ్‌ డాన్స్‌ డైరెక్టర్స్ అసోసియేషన్‌కి జానీ మాస్టర్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న విష‌యం విదితమే. కొన్ని నెల‌ల క్రితం జ‌న‌సేన పార్టీలో కూడా చేరి ఎమ్మెల్యే టిక్కెట్ ఆశించాడు. అయితే కూటమి సర్దుబాటులో భాగంగా ఆయనకు టికెట్‌ రాలేదు.

Latest News