Site icon vidhaatha

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు క‌రోనా

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క‌రోనా బారిన ప‌డ్డారు. ఈ విష‌యాన్ని ఆయ‌న త‌న సోషల్ మీడియా ద్వారా తెలియ‌జేశారు. క‌రోనా సోకింద‌నే విష‌యాన్ని తెలియ‌జేస్తూ.. నేను ప్ర‌స్తుతం ఐసోలేష‌న్‌లో ఉంటూ క‌రోనా నివార‌ణ‌కు సంబంధించిన చికిత్స పొందుతున్నాను. గ‌త కొద్ది రోజులుగా నాతో కాంటాక్ట్ అయిన వారు ప‌రీక్ష‌లు చేయించుకోండి. ఇంట్లోనే సుర‌క్షితంగా ఉంటూ, వీలున్న‌ప్పుడు వ్యాక్సిన్ చేయించుకోండి.

నా శ్రేయోభిలాషులు, స‌న్నిహితులు, అభిమానులు ఎవ‌రు ఆందోళ‌న చెందొద్దు. నా ఆరోగ్యం బాగానే ఉంది. మీరంద‌రు క్షేమంగా ఉండండి అని బ‌న్నీ పేర్కొన్నారు. అల్లు అర్జున్ ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పుష్ప చిత్ర షూటింగ్‌తో బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే. అక్రమ రవాణా చేస్తున్న గంధపుచెక్కల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్‌గా విడుద‌లైన టీజ‌ర్ అతి తక్కువ సమయంలోనే ఏకంగా 50 మిలియన్స్ ప్రేక్షకుల అభిమానుల మ‌న‌సు గెల‌చుకుంది.

Exit mobile version