Site icon vidhaatha

Shilpa Shetty|శిల్పాశెట్టి రెస్టారెంట్‌లో ఖ‌రీదైన కారు దొంగ‌త‌నం..అంత కాస్ట్‌లీ కారు ఎలా చోరీ చేశాడంటే..!

Shilpa Shetty|బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఒక‌ప్పుడు న‌టిగా అల‌రించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు బిజినెస్‌పై కూడా ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్టింది. ముంబైలోని పలు ప్రాంతాల్లో బాస్టియన్‌ పేరుతో న‌టి శిల్పాశెట్టి(Shilpa Shetty) రెస్టారెంట్స్‌ నిర్వహిస్తున్నారు. అందులో ఒకటి దాదర్‌లోని కోహినూర్ స్క్వేర్ లో ఉంది. దాదర్ వెస్ట్ లో కోహినూర్ స్క్వేర్ 48వ అంతస్తులో ఉన్న ఆమె రెస్టారెంట్ కి వచ్చిన ఒక కస్టమర్ బీఎండబ్ల్యూ కారుని పార్క్ చేయా, దానిని ఎవ‌రో దొంగిలించారు. ఆదివారం అక్టోబర్ 27న ఈ సంఘటన చోటుచేసుకుంది. కారు ధ‌ర‌ సుమారు రూ.80 లక్షలు ఉంటుంద‌ట‌. ఈ 2 సీటర్ కార్ ను బిల్డింగ్ పార్కింగ్ ఏరియా నుంచి ఎత్తుకెళ్లినట్లు సమాచారం.

34 ఏళ్ల యంగ్ వ్యాపారవేత్త రుహన్ ఫిరోజ్ ఖాన్ శిల్పా శెట్టి హోట‌ల్‌కి ఇద్ద‌రితో క‌లిసి అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత తన బీఎండబ్ల్యూ Z4 కార్ లో వ‌చ్చాడు. ఆ త‌ర్వాత త‌న కారుని రెస్టారెంట్ వాలెట్ పార్కింగ్ ఉద్యోగికి అప్పగించి, ఆ తర్వాత తన స్నేహితులతో కలిసి రెస్టారెంట్లోకి వెళ్లిపోయారు. రెస్టారెంట్(Restaurant) నుంచి బయటకు వచ్చిన తర్వాత చూస్తే ఆ కారు క‌నిపించ‌కుండా పోయింది. అక్క‌డున్న సీసీటీవీ కెమెరాలను ఒక‌సారి పరిశీలించ‌గా, ఆ కారును రెండు గంటల సమయంలో ఎవ‌రో కొంద‌రు గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించినట్లు తేలింది.దాంతో చేసేదేమి లేక అక్కడి శివాజీ పార్క్ పోలీసుస్టేష‌న్‌లో కారు ఓన‌ర్ ఫిర్యాదు చేశాడు. భారతీయ న్యాయ సంహిత 2023లోని సెక్షన్ 303 (2) దొంగతనం కేసు కింద ఈ కేసును నమోదు చేసిన‌ట్లు తెలుస్తోంది.

అధికారులు వెంటనే దర్యాప్తు ప్ర‌క్రియ వేగవంతం చేశారు. మరోవైపు న‌టి శిల్పా శెట్టికి చెందిన రెస్టారెంట్‌ భద్రతా చర్యలపై కార్ ఓన‌ర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పున‌రావృత్తం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరాడు. అయితే, ఇంత జరిగినా, ఇంకా శిల్పా శెట్టి ఈ విషయంపై ఏమాత్రం స్పందించ‌లేద‌ని కారు ఓన‌ర్ ఆమెను త‌ప్పుబ‌ట్టారు. సాధార‌ణంగా శిల్పాశెట్టి రెస్టారెంట్ కు ప్రముఖ వ్యాపారవేత్తలు, బాలీవుడ్ నటులూ త‌ర‌చుగా వస్తుంటారు. అలాంటి రెస్టారెంట్ నుంచి ఓ లగ్జరీ కారు(Luxury car) చోరీకి గురి కావడం అందరినీ షాక్ కు గురి చేస్తోంది. ముంబైలోని దాదర్ వెస్ట్ లో ఉన్న కోహినూర్ స్క్వేర్ 48వ అంతస్తులో ఈ రెస్టారెంట్ .. ముంబై సిటీ అందాలను చూస్తూ వెరైటీ రుచులను ఆస్వాదించేలా ఉంటుంది. అందుకే ప‌లువురు ప్ర‌ముఖులు ఈ రెస్టారెంట్‌కి వ‌చ్చి సంద‌డి చేస్తుంటారు.

Exit mobile version