విధాత: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికల నుంచి నటుడు సీవీఎల్ నరసింహారావు తప్పుకున్నారు. అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేసిన ఆయన.. తాజాగా ఆ నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. అధ్యక్ష పదవి కంటే తనకు మా సభ్యుల సంక్షేమమే ముఖ్యమన్నారు. పోటీలోని 2 ప్యానెళ్లలో ఎవరికీ తాను మద్దతు ఇవ్వట్లేదని స్పష్టం చేశారు. పూర్తి వివరాలు రెండ్రోజుల్లో తానే స్వయంగా వెల్లడిస్తానని సీవీఎల్ తెలిపారు.