Deepika Padukone| ఏంటి.. దీపికాకి పుట్ట‌బోయే బిడ్డ పేరు క‌ల్కినా.. అంత‌టా ఇదే చ‌ర్చ‌..!

Deepika Padukone| బాలీవుడ్ నుండి హాలీవుడ్‌కి వెళ్లిన అందాల ముద్దుగుమ్మ దీపికా ప‌దుకొనే క‌ల్కి అనే చిత్రంతో టాలీవుడ్ ప్రేక్ష‌కులని కూడా అలరించింది. ఇదే టాలీవుడ్ డెబ్యూ మూవీ అని అంద‌రు అనుకుంటున్నారు. కాని లవ్ ఫర్ ఎవర్ అనే సినిమాలో తొలి సారిగా న‌టించింది దీపికా. జయంత్ సి పరాన్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రణదీప్, మృదుల అనే కొత్త జంట నటించారు. 2019 లో వచ్చిన ఈ చిత్రం ఎప్పుడు వ‌చ్చింది, ఎప్పుడు

  • Publish Date - June 30, 2024 / 07:32 PM IST

Deepika Padukone| బాలీవుడ్ నుండి హాలీవుడ్‌కి వెళ్లిన అందాల ముద్దుగుమ్మ దీపికా ప‌దుకొనే క‌ల్కి అనే చిత్రంతో టాలీవుడ్ ప్రేక్ష‌కులని కూడా అలరించింది. ఇదే టాలీవుడ్ డెబ్యూ మూవీ అని అంద‌రు అనుకుంటున్నారు. కాని లవ్ ఫర్ ఎవర్ అనే సినిమాలో తొలి సారిగా న‌టించింది దీపికా. జయంత్ సి పరాన్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రణదీప్, మృదుల అనే కొత్త జంట నటించారు. 2019 లో వచ్చిన ఈ చిత్రం ఎప్పుడు వ‌చ్చింది, ఎప్పుడు పోయింది అనే విష‌యం కూడా ఎవ‌రికి తెలియ‌దు. జయంత్ సి పరాన్జీ మాట కాద‌న‌లేక ఆ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో నటించింది. అయితే ఈ సినిమా హిట్ కాక‌పోవ‌డంతో దీపికా గురించి పెద్ద‌గా ఎవ‌రికి తెలియ‌దు. అయితే దీపికా క‌ల్కి అనే చిత్రంలో సుమ‌తి పాత్ర‌లో న‌టించి ఇప్పుడు టాలీవుడ్ ప్రేక్షకుల మ‌న‌స్సులు కొల్ల‌గొట్టింది.

‘క‌ల్కి 2898 ఎడి’ చిత్రంలో దీపిక ప‌దుకొనే గ‌ర్భిణిగా క‌నిపించారు. ఆమెని గ్లామ‌ర‌స్‌గా చూపించకుండా భ‌గ‌వంతుని గ‌ర్భంలో మోస్తున్న త‌ల్లిగా చూపించి మంచి మార్కులు కొట్టేశారు నాగ్ అశ్విన్. దీపిక‌కు జ‌న్మించే భ‌గ‌వాన్ – క‌ల్కి అని అంతా ఊహిస్తున్నారు. అయితే రీల్ లైఫ్‌లో గ‌ర్భిణిగా క‌నిపించిన దీపికా ప‌దుకొణే రియ‌ల్ లైఫ్‌లో కూడా గ‌ర్భిణి కావ‌డం విశేషం. అయితే నిజ జీవితంలో దీపికా ప‌దుకొణే గ‌ర్భిణీ కావ‌డంతో ఒక‌వేళ ఆమెకి మ‌గ‌పిల్లాడు పుడితే క‌ల్కి అని పేరు పెట్టుకుంటుందా? అంటూ స‌ర‌దాగా ముచ్చ‌టించుకుంటున్నారు అభిమానులు. పాన్ ఇండియా వ‌ర‌ల్డ్ మూవీ క‌ల్కి చిత్రంలో న‌టించిన దీపికా పాత్ర‌కి ఎంత పేరు వ‌చ్చిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.

అంతేకాదు ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అవ్వ‌డంతో ఈ ఆనంద స‌మ‌యాన క‌ల్కి భ‌గ‌వంతుని నామ‌ధేయాన్ని సెంటిమెంట్ గా ప‌రిగ‌ణించి త‌న బిడ్డ‌కు ఇదే పేరు పెట్టుకుంటుంద‌ని కొంద‌రు అభిమానులు విశ్లేషించుకుంటున్నారు. క‌ల్కి సినిమాకి ఇండియాలోనే కాకుండా హాలీవుడ్‌లోను మంచి ప్ర‌శంస‌లు ల‌భిస్తున్నాయి. దీపిక పాత్ర‌పైనా ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. ఈ ఆనంద స‌మ‌యాన్ని రియ‌ల్ గానే బిడ్డ‌ను మోస్తూనే సెల‌బ్రేట్ చేసుకుంటోంది దీపికా ప‌దుకొణే. చూస్తుంటే ఈ భామ త‌నకి కొడుకు పుడితే క‌ల్కి పేరుని పెట్టుకున్న ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేద‌ని కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు.

Latest News