Deepika Padukone – Ranveer Singh | బాలీవుడ్ స్టార్ కపుల్స్ రణవీర్ సింగ్( Ranveer Singh ), దీపికా పదుకొణె( Deepika Padukone ) పేరెంట్స్ అయ్యారు. దీపికా పండంటి ఆడబిడ్డకు ఆదివారం ఉదయం జన్మనిచ్చింది. ముంబైలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో ఆమె డెలివరీ అయ్యారు. కాగా ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. తల్లిదండ్రులైన రణవీర్ – దీపికా దంపతులకు బాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన రామ్ లీలా( Ram Leela ) చిత్రంలో తొలిసారి దీపికా – రణవీర్ కలిసి నటించారు. ఈ షూటింగ్ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇరు కుటుంబాల అంగీకారంతో 2018లో వివాహం చేసుకున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీతో గతేడాది ప్రేక్షకులను అలరించారు రణవీర్. ప్రస్తుతం రణవీర్ సింగమ్ అగైన్ కోసం వర్క్ చేస్తున్నారు. మరో వైపు కల్కి 2898 ఏడీతో ఇటీవల విజయాన్ని అందుకున్న దీపికా పదుకొణె.