
విధాత: దృశ్యం సినిమాలో వెంకటేష్ చిన్న కూతురిగా నటించి అందరిని మెప్పించిన చిన్నది ఇప్పుడు ఏలా ఉందో చూశారా..ఆ సినిమాలో భయం భయంగా ఉంటూ తండ్రి చెప్పిన మాటలే చెప్పి అద్భుత నటన ప్రదర్శించి తెలుగు ప్రజలను మెప్పించిన ఈ చిన్నదాని పేరు ఏస్తర్ అనిల్.
దృశ్యం 2 సినిమాలోను వెంకటేష్ చిన్న కూతురిగా మరో మారు నటించింది. అంతేగాక ఆహా ఓటీటీ వేదికగా విడుదలైన జోహార్ సినిమాలోను ఓ జంటగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఈ అమ్మడు ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ తన ఫోటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంది.