Site icon vidhaatha

Director Krish|మ‌ళ్లీ డాక్ట‌ర్‌తోనే క్రిష్ వివాహం.. కాక‌పోతే ఆమెకి 11 ఏళ్ల బిడ్డ ఉన్నాడా..!

Director Krish|ద‌ర్శ‌కుడు క్రిష్ గురించి తెలుగు ప్రేక్ష‌కుల‌కి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. టాలీవుడ్‌లో మంచి చిత్రాలు తెర‌కెక్కించి టాప్ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్నాడు. అయితే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు చిత్రంతో త్వ‌ర‌లో క్రిష్ ప‌ల‌క‌రించాల్సింది కాని డైరెక్టర్ క్రిష్ అనివార్య కారణాలతో ఆ ప్రాజెక్టు నుంచి బయటకు వచ్చేసిన సంగతి తెలిసిందే. అలా హరిహర వీరమల్లు వదిలేసిన‌ క్రిష్ ఇప్పుడు అనుష్క ఘాటీ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాతో మంచి హిట్ కొట్టాల‌ని భావిస్తున్నాడు. గ‌త కొద్ది రోజులుగా క్రిష్‌కి సరైన హిట్ ద‌క్క‌లేదు. అందుకే ఈ మూవీపైనే బోలెడ‌న్ని ఆశ‌లు పెట్టుకున్నాడు.

ప్రముఖ సినీ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి రెండో వివాహానికి సిద్ధమవుతున్నారన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొన్నాళ్ల క్రితం రమ్య అనే వైద్యురాలిని క్రిష్ వివాహం చేసుకోగా, కొన్నాళ్ల‌పాటు ఈ జంట బాగానే ఉన్నారు. అయితే వారి వివాహ బంధంలో సమస్యలు ఎదురవ్వడంతో పరస్పర అంగీకారంతో ఆమధ్య విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు ఆయ‌న మ‌రో వివాహం చేసుకునేందుకు సిద్ధ‌మైన‌ట్టు తెలుస్తుంది. వచ్చే వారం వివాహ నిశ్చితార్ధ వేడుక జరగనుందన్న వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆయన మళ్లీ ఒక డాక్టర్ నే వివాహం చేసుకోబోతున్నట్లు స‌మాచారం.

ఇక‌ ఆమెకు కూడా అప్పుడే వివాహం జరిగి, తన భర్త నుంచి విడాకులు అయ్యాయని, ఆమెకు 11 ఏళ్ళ కుమారుడు కూడా ఉన్నాడని, అలాంటి ఆమెతో ఈయన ఇప్పుడు వివాహానికి సిద్ధమవుతున్నారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.. మొదటి భార్య లాగే ఇప్పుడు రెండవ కాబోయే భార్య కూడా డాక్టర్ కావడంతో డాక్టర్లను డైరెక్టర్ క్రిష్ వదిలేలా లేడే అంటూ కొంతమంది సెటైరిక‌ల్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే క్రిష్ రెండో వివాహానికి సంబంధించి అధికారికంగా సమాచారం లేదు. మ‌రి కొద్ది రోజుల‌లోనే దీనిపై పూర్తి క్లారిటీ రావ‌ల‌సి ఉంది.

Exit mobile version